ఆనందయ్య మందుపై ఏపీ ఆయూష్ కమిషనర్ వి. రాములు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందును కోవిడ్ కోసం ఉపయోగిస్తారన్న అంశం ఇప్పటిదాకా ఎక్కడ లేదు కాబట్టి సుమోటాగా ఇది కోవిడ్ కోసం పనిచేస్తుందా? లేదా అన్నది పరిశోధన చేస్తున్నామని ఆయూష్ కమిషనర్ రాములు తెలిపారు.
ఇక ఆనందయ్య సైతం ఈ మందును కోవిడ్ కోసం తయారు చేసిందని ఎక్కడ క్లెయిమ్ కూడా చేయలేదని కమిషనర్ రాములు స్పష్టం చేశారు. ఆనందయ్య ఈ మందును వివిధ సమస్యలపై గత 30 ఏళ్లుగా ఉపయోగిస్తున్నాడు. ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని ఇదే మందును కోవిడ్ రోగుల కోసం కూడా ఇచ్చారన్నారు. అటువంటి లక్షణాలను ఇది వరకు తీర్చేసిన అనుభవం ఆనందయ్యకు ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని కోవిడ్ ద్వారా వచ్చే లక్షణాలను తగ్గించడం ఈ మందు ద్వారా ఆనందయ్య చేస్తున్నాడని రాములు క్లారిటీ ఇచ్చారు.
ఇది కోవిడ్ కు మందుగా గుర్తించడం అనేది ఆనందయ్య దరఖాస్తు చేసుకుంటే అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతానికి ఆనందయ్య దరఖాస్తు ఏమీ చేసుకోలేదు కాబట్టి ఆ కోణంలో దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం లేదని రాములు తెలిపారు.
ఆనందయ్య ఆయుర్వేద మందుగా అప్రూవ్ చేసుకోవాలంటే ఆయన ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. లేదంటే ఒక స్థానిక మందుగా.. గృహమందుగా.. మూలిక వైద్యంగా అనేక రకాల వైద్యాలు అందుబాటులో ఉన్నాయని.. వాటికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని కమిషనర్ రాములు స్పష్టం చేశారు.
దీన్ని బట్టి ఆనందయ్య ఆయుర్వేద మందును స్థానికంగా పంపిణీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కమిషనర్ రాములు పరోక్షంగా చెప్పినట్టుగా అర్థమవుతోంది.Full View
ఇక ఆనందయ్య సైతం ఈ మందును కోవిడ్ కోసం తయారు చేసిందని ఎక్కడ క్లెయిమ్ కూడా చేయలేదని కమిషనర్ రాములు స్పష్టం చేశారు. ఆనందయ్య ఈ మందును వివిధ సమస్యలపై గత 30 ఏళ్లుగా ఉపయోగిస్తున్నాడు. ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని ఇదే మందును కోవిడ్ రోగుల కోసం కూడా ఇచ్చారన్నారు. అటువంటి లక్షణాలను ఇది వరకు తీర్చేసిన అనుభవం ఆనందయ్యకు ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని కోవిడ్ ద్వారా వచ్చే లక్షణాలను తగ్గించడం ఈ మందు ద్వారా ఆనందయ్య చేస్తున్నాడని రాములు క్లారిటీ ఇచ్చారు.
ఇది కోవిడ్ కు మందుగా గుర్తించడం అనేది ఆనందయ్య దరఖాస్తు చేసుకుంటే అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతానికి ఆనందయ్య దరఖాస్తు ఏమీ చేసుకోలేదు కాబట్టి ఆ కోణంలో దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం లేదని రాములు తెలిపారు.
ఆనందయ్య ఆయుర్వేద మందుగా అప్రూవ్ చేసుకోవాలంటే ఆయన ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. లేదంటే ఒక స్థానిక మందుగా.. గృహమందుగా.. మూలిక వైద్యంగా అనేక రకాల వైద్యాలు అందుబాటులో ఉన్నాయని.. వాటికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని కమిషనర్ రాములు స్పష్టం చేశారు.
దీన్ని బట్టి ఆనందయ్య ఆయుర్వేద మందును స్థానికంగా పంపిణీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కమిషనర్ రాములు పరోక్షంగా చెప్పినట్టుగా అర్థమవుతోంది.