గనులు ప్రకృతి వనరులు. అది ప్రభుత్వానికి సంపద. భవిష్యత్తుకు పెన్నిధి. అలాంటి గనులను ఏ ప్రభుత్వం ఉన్నా తవ్వుకుపోవడం ఒక అలవాటు అయిన అవినీతిగా మారిపోయింది. అధికారంలోకి వస్తే చాలు ప్రకృతిని చెరబట్టే కల్చర్ కూడా మొదలైపోయింది. దీని వల్ల పర్యావరణ విఘాతం కలుగుతుందని తెలిసినా కూడా వెనక్కి అడుగు వేయడంలేదు. అలాగే వందల వేల కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
అయినా కూడా అధికారులు సైతం చూస్తూ ఊరుకుంటున్నారు. దీని మీద విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే గట్టిగానే గర్జించారు. అక్రమంగా గనులను తవ్వేసుకుంటున్నా అధికారులు పట్టించుకోరా అని నిలదీశారు. ఆయన ఏకంగా అనకాపల్లి భూగర్భ గనుల శకహ ఆఫీసుకు వచ్చి మరీ అక్కడ రికార్డులను పరిశీలించారు.
అనకాపల్లి డివిజన్ పరిధిలో ఉన్న క్వారీలు, క్రషస్ ల అనుమతుల మీద మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ని వివరాలు అడిగి తెలుసుకున్న అయ్యన్న వైసీపీ నేతల మీద తీవ్ర విమర్శలు చేశారు. అనకాపల్లి డివిజన్ పరిధిలో 340 క్వారీస్ ఉండగా అందులో 41 క్వారీలకు మాత్రమే పర్యావరణ శాఖ అనుమతులు ఉన్నాయని చెప్పారు. ఇక మిగిలిన వాటిలో జరుగుతున్న తవ్వకాలు అన్నీ కూడా అక్రమాలే ఆయన మండిపడ్డారు.
దీనికి అధికారుల స్థాయిలో కూడా సహకారం అందుతోందని అన్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయం పక్కదారి పడుతోందని, అది కాస్తా అక్రమార్కుల పరం అవుతోందని అన్నారు. ఈ విషయాన్ని తాము ఇంతటితో వదిలిపెట్టేది లేదని, అసెంబ్లీలో ప్రస్థావిస్తామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నేతల కనుసన్నలలో సాగుతున్న అక్రమాల చిట్టా బయటకు తీస్తామని హెచ్చరించారు.
మొత్తానికి గనుల భాగోతాల వెనక ఉన్న ఘనులు ఎవరు అన్నది టీడీపీ జనాల ముందు పెడతామని అంటోంది. దీంతో మరో రాజకీయ సమరానికి మైనింగ్ డిపార్ట్మెంట్ వేదికగా మారనుంది అంటున్నారు.