ఆయన యువ ఫైర్ బ్రాండ్ నాయకుడు. పైగా మాజీ మంత్రి కుమారుడు. ఇంకా చెప్పాలంటే.. సవాళ్ల నేత. ఆయనే చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడు.. చింతకాయల విజయ్ పాత్రుడు. టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాల యువ నేతగా విజయం పాత్రుడు గుర్తింపు పొందారు. రాజకీయంగా ఎలాంటి అవకాశం వచ్చినా.. వదిలి పెట్టకుండా.. తనకు అనుకూలంగా మార్చుకునే సీనియర్లను మించిన నాయకుడిగా విజయ్ గుర్తింపు పొందారు. ముఖ్యంగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నేతల్లో విజయ్ ముందు వరసులో నిలిచారు.
అదేవిధంగా సీఎం జగన్‌కు కూడా ఆయన సవాళ్లు రువ్వి.. రాజకీయాలను వేడెక్కించారు. పార్టీలోనూ యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉన్నత విద్యావంతుడు కావడం.. పార్టీలో చురుగ్గా వ్యవహరించడం వంటివి విజయ్‌కు కలిసి వస్తున్న పరిణామాలు. అయితే.. గత ఎన్నికల్లోనే విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ.. అప్పటి సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు అంగీకరించలేదు. దీంతో మళ్లీ ఇక్కడ నుంచి మాజీ మంత్రి అయ్యన్నే పోటీ చేశారు. సరే.. జగన్ సునామీలో ఈయన కూడా ఓడిపోయారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటికైనా.. విజయ్ ఇక్కడ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. మరోవైపు.. అయ్యన్న కూడా పట్టు జారకుండా చూసుకుండా చూసుకుంటున్నారు. తనకు టచ్‌లొ ఉన్న పార్టీ నేతలను ముందుకు తీసుకువెళ్తున్నారు. విజయ్‌ను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. పైగా నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌కు కూడా.. సవాళ్లు రువ్వుతున్నారు. ఇంత వరకుబాగానే ఉన్నా.. ఈ సారైనా.. చింతకాయల విజయ్‌కు అవకాశం దక్కుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి కారణం.. గత ఎన్నికలను మించిన వాతావరణంలో వచ్చే ఎన్నికలు జరుగుతుండడమే. 2019 ఎన్నికలే.. అన్ని పార్టీలకూ చావో రేవో .. అన్నవిధంగా సాగాయి. అయితే.. 2024 ఎన్నికలు మరింతగా పార్టీలకు ప్రాధాన్యంగా మారాయి.
ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికలను సవాలుగా తీసుకోనుంది. చంద్రబాబు శపథంతోపాటు.. తమ సర్కారుకు రెండోసారి అధికారం దక్కించుకోవడం ద్వారా నవ్యాంధ్రలో రికార్డు సృష్టించాలని.. వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గతంంలో జరగని విధంగా జరగడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలో భారీ పోరును దృష్టిలో పెట్టుకుని.. విజయ్‌కు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? అనేది డౌట్. బహుశా అందుకే.. అయ్యన్న కూడా ముందు జాగ్రత్తగా.. అవసరమైతే.. తనైనా.. మళ్లీ పోటీకి రెడీ అనేలా సంకేతాలు ఇస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. అదే జరిగితే వారసుడి ఆశలపై అయ్యన్నే నీళ్లు చల్లినట్టు అవుతుంది.