ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ ఆయన కేబినేట్ లోని మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివిధ పండుగల సందర్భంగా ఇస్తున్న చంద్రన్న కానుకలపై మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉచితంగా కానుకలు ఇస్తూ ఏటా రూ. 950 కోట్లను వృథా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
విశాఖ జిల్లా నాతవరం మండలం మర్రిపాలెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్న… కానుకలు వంటి తాత్కాలిక పథకాల వల్ల ప్రయోజనం ఉండదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ డబ్బును పోలవరం లాంటి ప్రాజెక్టుకు ఖర్చు పెడితే బాగుంటుందన్నారు. ఈ విషయాన్ని తాను సీఎంకు కూడా చెప్పానన్నారు. సంక్షేమ పథకాల అమలులో కింది స్థాయిలో కొన్ని పొరపాట్లు జరుగుతున్న మాట వాస్తవమేనని అయ్యన్నపాత్రుడు చెప్పారు. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇలాంటి తాత్కాలిక పథకాల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని అన్నారు. పోలవరం లాంటి శాశ్వత ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే బాగుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. అయితే... అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైరయినట్లు టాక్. ఏమైనా చెప్పాలనుకుంటే తనతో చెప్పాలి కానీ ప్రజల ముందు ఇలా పలుచన చేస్తే ఎలా అని మందలించినట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/