అయ్యప్ప స్వాములకు షాకిచ్చిన రైల్వేశాఖ

Update: 2018-12-26 11:45 GMT
శబరిమలలోని అయ్యప్ప దేవాలయం కేంద్రంగా ఎన్నో వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవల శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడం.. వాళ్లు రాకుండా సంప్రదాయ భక్తులు అడ్డుకోవడం.. దీని పై పెద్ద రచ్చ జరగడం తెలిసిందే.

తాజాగా అయ్యప్ప భక్తులకు మరో షాక్ లాంటి వార్తను రైల్వే శాఖ తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా శబరిమలకు రైలులో వచ్చే అయ్యప్ప భక్తులు బోగిల్లో దీపం, హారతి కర్పూరం వెలిగించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఒక వేళ ఈ నియమాలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసి సంచలనలం సృష్టించింది.

శబరిమలకు చాలా మంది అయ్యప్ప భక్తులు రైలులోనే వస్తుంటారు. దేశవ్యాప్తంగా చాలా మంది ఇందులోనే ప్రయాణిస్తుంటారు. ప్రయాణానికి రెండు మూడు రోజుల సమయం పడుతుండడంతో అయ్యప్ప భక్తులు స్నానాలు, పూజలు భోగిల్లోనే చేస్తుంటారు. కానీ ఇప్పుడు రైల్వే శాఖ బోగీల్లో పూజల్లో ఉపయోగించే కర్పూరంను వెలిగించవద్దని ఆదేశాలివ్వడం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్ లో నిప్పు వెలిగించడం ప్రమాదకరమే అయినప్పటికీ తమ సంప్రదాయాలు గౌరవించాలని భక్తులు కోరుతున్నారు. రైల్వే శాఖ మాత్రం ప్రమాదాలకు జరగకుండా ఉండేందుకు కర్పూరం వెలిగిస్తే 1000 రూపాయల జరిమానా విధిస్తామని.. దాంతోపాటు 3 ఏళ్లు జైలుశిక్ష పడుతుందని ఉత్తర్వులు జారీ చేసింది.
    

Tags:    

Similar News