హైదరాబాద్ క్రికెట్ సంఘం క్రీడ స్పూర్తి కంటే రాజకీయ రంగును పులుముకుంటోంది. గత ఏడాది జరిగిన హెచ్ సీఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ ను పలువురు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే స్పందించిన అజహార్ తాజాగా మళ్లీ రియాక్టయ్యారు. ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో అజహర్ మీడియాతో మాట్లాడారు. తనకు బీసీసీఐ నుంచి క్లియరెన్స్ ఉందని, కానీ జైన్ తో పాటు హెచ్‌సీఏ అధికారులు తనను ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకున్నారని, తనకు అర్హత లేదని రిటర్నింగ్ ఆఫీసర్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు.
తనను పోటీ చేయకుండా అడ్డుకున్న ప్రకాశ్ జైన్‌పై కేసు వేయాలని నిర్ణయించుకున్నట్లు మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తెలిపారు. ఈ అంశంలో తాను న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. తన దగ్గర బీసీసీఐ లేఖలు ఉన్నాయని, అందుకే ఈ కేసులో లీగల్ గా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేవలం ఎన్నికల్లో పోటీచేయకుండా ఉండేందుకు తనను అడ్డుకున్నారని అజహర్ ఆరోపించారు. బీసీసీఐ నుంచి తనకు అనుమతి లేదని హెచ్ సీఏ అధ్యక్షుడు జీ వివేకానంద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తన దగ్గర రాతపూర్వక ఆధారాలు ఉన్నాయని - హెచ్ సీఏ ప్రెసిడెంట్ అబద్దాలు చెప్పడం సరికాదు అని, బీసీసీఐ ఇచ్చిన క్లియరెన్స్ లెటర్ తన దగ్గర ఉందని, ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అని అజర్ అన్నారు. హెచ్ సీఏ అధ్యక్షుడు వివేకానందతో కానీ ఇతర అధికారులపైన కానీ తనకు వ్యక్తిగత శత్రుత్వం ఏమీ లేదన్నారు.
హెచ్ సీఏ ప్రెసిడెంట్ వివేకానంద తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని అజహరుద్దీన్ ఆరోపించారు. క్యాబినెట్ మంత్రి హోదా ఉన్న వివేకానంద కూడా హెచ్ సీఏ అధ్యక్షుడిగా అనర్హుడని - దానిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కూడా అజహర్ డిమాండ్ చేశారు. జీ వెంకటస్వామి కప్ టోర్నీ నిర్వహణకు బీసీసీఐ అనుమతి లేదని - కానీ హెచ్ సీఏ ఆ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇతర రాష్ర్టాలు టోర్నీల కోసం బీసీసీఐ పర్మిషన్ తీసుకుంటే - మన హెచ్ సీఏ మాత్రం అలా చేయడం లేదన్నారు. బీసీసీఐ అధికారులైన వినోద్ రాయ్ - రాహుల్ జోరీలను కలిసేందుకు తాను ముంబై వెళ్లనున్నట్లు తెలిపారు. మాజీ అంతర్జాతీయ - ఫస్ట్ క్లాస్ క్రికెటర్లను ముంబై తీసుకువెళ్లనున్నట్లు అజహర్ చెప్పారు. తమ కేసును వ్యక్తిగతంగా బీసీసీఐ ముందు ఉంచాలన్నదే తమ ఉద్దేశమని - దీని పట్ల బీసీసీఐ సరైన చర్య తీసుకుంటుందని మాజీ క్రికెటర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన కేసును ఓంబుడ్స్‌మన్ ఎల్ నరసింహారెడ్డి ప్రజెంట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. తనుకు అనుకూలమైన తీర్పు వస్తుందన్న ఆశాభావాన్ని అజర్ వ్యక్తం చేశారు. సుప్రీం ఆదేశాలకు కానీ లోధా సూచనలకు అనుకూలంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం వ్యవహరించడం లేదన్నారు.