వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో బీటెక్ చదువుతున్న రోహిత్ అనే ఓ విద్యార్థి సంచలన కామెంట్ చేశారు. ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగం లేదా నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన టీడీపీ చంద్రబాబు నాయుడు మాటను గుర్తుచేస్తూ...ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు అయినప్పటికీ దాన్ని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ఈ మాట ప్రకారం నిరుద్యోగిగా ఉన్న తనకు ఇప్పటివరకూ రూ.64 వేలు అప్పు ఉన్నందున తాను ఎవరిని అడగాలని రోహిత్ ప్రశ్నించాడు.
కాగా ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్తున్న టీడీపీ నాయకులు చెబుతున్నపుడు టీడీపీ ఎంపీలైన సుజనా చౌదరి - సీఎం రమేష్ - గల్లా జయదేవ్ వంటి వారు పక్క రాష్ట్రాల్లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారని ఇంజినీరింగ్ ఫైనలియర్ శౌర్య అనే విద్యార్థి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుని వస్తానని చెప్పి చంద్రబాబు వందలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశీ పర్యటనలు చేస్తున్నారని తద్వారా ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న హిమబిందు అనే విద్యార్థి జగన్ ను ప్రశ్నించారు. దీనికి ప్రతిపక్షనేత స్పందిస్తూ చంద్రబాబు వచ్చీరాని ఇంగ్లీష్ లో మాట్లాడితే పరిశ్రమలు రావని - ప్రత్యేక హోదా వల్లే వస్తాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే పెట్టుబడులు వస్తాయని తెలిపారు. దేవుని దయ వల్ల మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని చెప్పిన జగన్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని విప్లవాత్మకంగా అమలుచేస్తామని హామీ ఇచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/