మూడు వారాలకు పైబడి వణికించే చలితో చేస్తున్న రైతుల ఉద్యమం ఒక కొలిక్కి రావటం లేదు. వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి నిరసన చేస్తున్నప్పటికి.. వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న పద్దతి ఇప్పుడు గందరగోళానికి గురి చేస్తోంది. రైతుల ఉద్యమాన్ని సీరియస్ గా తీసుకొని.. చర్చలతో పరిష్కారాన్ని వెతకాలన్నట్లుగా కేంద్రం తీరు లేదన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. మోడీ సర్కారు అనుసరిస్తున్న తీరును పలువురు తప్పు పడుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే విషాద ఉదంతం ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లోని సోనిపట్ లో రైతు ఆందోళనల్లో పాల్గొంటున్న సిక్కు మతగురువు బాబా రామ్ సింగ్ సూసైడ్ చేసుకోవటం కలకలం రేపుతోంది. తీవ్ర ఉద్రిక్తతలకు కారణం కాబోతోంది. హర్యానాలోని గురుద్వారాలో మత ప్రభోదకుడిగా వ్యవహరిస్తున్న ఈ 65 ఏళ్ల పెద్ద మనిషి తాను ఆత్మహత్య చేసుకోవటానికి ముందు.. తన సూసైడ్ కు కారణం ఏమిటనన విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మూడు వారాలుగా ఆందోళన చేస్తున్నప్పటికి కేంద్రం సానుకూలంగా స్పందించకపోవటంపై ఈ మత గురువు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘రైతుల్లో బాదను చూస్తున్నా.. వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయటం లేదు. వారి బాధను నేను పంచుకుంటున్నా. అన్యాయం చేయటం పాపం. అన్యాయాన్ని ఉపేక్షించటం కూడా పాపం. రైతుల ఆందోళనకు మద్దతు పలికేందుకు కొందరు అవార్డుల్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. నేను నన్ను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నా’’ అని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.
గన్ తో కాల్చుకొన్న ఆయన్ను ఆసుపత్రికి చేర్చేలోపే మరణించినట్లుగా చెబుతున్నారు. ఈ విషాద ఉదంతం రైతుల ఆగ్రహాన్ని మరింత పెంచటంతో పాటు.. రైతుల ఉద్యమాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందంటున్నారు. ఇలాంటివి మరిన్ని చోటు చేసుకోకముందే.. మోడీ సర్కారు స్పందించాలన్న డిమాండ్ పెరుగుతోంది.