''భారత్ మాతాకీ జై" అని అందరూ అనాలని రాజ్యంగంలో ఎక్కడైనా ఉందా? నా గొంతుపై కత్తి పెట్టినా కూడా నేనా నినాదం చేయబోనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అంతా మర్చిపోతున్న దశలో యోగా గురు బాబా రాందేవ్ దానిపై మరోసారి దుమారం రేపారు. అసద్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన 'భారత్ మాతాకీ జై" అనని వారిని తాను తల నరికేసేవాడినని.. కానీ, చట్టాలపై గౌరవంతో ఆ పనిచేయడం లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలా అంటే వేలమందినైనా నరికేస్తానన్నట్లుగా ఆయన మాట్లాడారు. భారత్ మాతాకీ జై అనడానికి వ్యతిరేకిస్తున్నవారంతా సిగ్గు పడాలన్నారు. ప్రతి ఒక్కరు మాతృదేశాన్ని గౌరవించాలని సూచించారు.
కాగా కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వివాదం దేశంలో పెద్ద దుమారమే రేపింది. పార్లమెంటులోనూ పెద్ద చర్చే జరిగింది. దేశంలోని బడా నేతలు, మతగురువులు ఇప్పటికే స్పందించారు. భారత్ మాతాకీ జై అనడానికి ఇష్టపడని అసదుద్దీన్ పై చాలామంది విరుచుకుపడ్డారు. కాస్త ఆలస్యంగా స్పందించిన రాందేవ్... ఆలస్యమైనా ఆవేశంగా స్పందించారు.