ముక్కు మూసుకొని యోగా ఎలా చేయాలో చెప్పే గురువు వ్యాపారం చేయగలరా? సన్యాసిగా తనదైన జీవితాన్ని గడిపేస్తూ తన చుట్టూ ఉన్న వారికి ధర్మోపదేశాలు బోధించే ఆయనలో అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడా? అన్న సందేహాలు కలిగేలా చేయటమే కాదు.. మల్టీ నేషన్ కంపెనీలకు సైతం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా బిజినెస్ చేసే ఆయన ఎవరో ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. అవును.. యోగా గురువు రాందేవ్ బాబా. పతంజలి బ్రాండ్ తో దేశ కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టించే ఆయన.. అవసరాన్ని.. అవకాశానికి తగ్గట్లుగా పొలిటికల్ వ్యాఖ్యలు చేస్తుంటారు.
తాజాగా ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు ఎపిసోడ్ పై తాజాగా నోరు విప్పిన ఆయన.. బీజేపీ నేతలపై ఓ రేంజ్ లో ఏసుకున్నారు. తనదైన శైలిలో ఎటకారం చేసుకున్న ఆయన.. నోట్ల రద్దు.. అనంతరం బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకునే విషయంలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు యోగా గురువును కూడా కదిలించినట్లుంది. అందుకే ఆయన తనదైన శైలిలో మోడీబ్యాచ్ కు చురకలు వేశారు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయం సరిగ్గా పెళ్లిళ్ల సీజన్ లో తీసుకోవటంతో దేశంలోని పలు కుటుంబాల మీద ఈ ప్రభావం పడింది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. పెళ్లిళ్ల సీజన్ లో బీజేపీ సర్కారు తీసుకున్నఈ నిర్ణయానికి కారణం.. బీజేపీలో బ్రహ్మచారులు ఎక్కువగా ఉండటమేఅంటూ చలోక్తి విసిరారు. బీజేపీలో బ్రహ్మచారులు ఎక్కువని.. అందుకే వారికి ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ అని తెలీదని.. అది వారి పొరపాటుగా ఆయన అభివర్ణించారు. నోట్ల రద్దుపై 15 రోజులు లేదంటే నెల రోజుల తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే చాలా కుటుంబాలు ఇన్ని ఇబ్బందులు పడేవి కావన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల కొంత మంచి కూడా జరిగిందని.. ఎవరూకట్నాలు అడగటం లేదంటూ కాస్త కవరింగ్ చేసేప్రయత్నం చేశారు. కానీ.. తానేం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/