పాక్ తో ఉద్రిక్తతలు - సర్జికల్ స్ట్రయిక్సు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రముఖులు - నేతలు స్పందిస్తున్నారు. తాజాగా యోగా గురువు రాందేవ్ బాబా కూడా స్పందించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్ తో చర్చలు జరపడమంటే పంది ఎదుట ముత్యాలు చల్లడం వంటిదేనని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల ఆగడాలకు ప్రతిస్పందనగా నియంత్రణ రేఖను దాటి భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ అద్భుతమంటూ ఆయన కొనియాడారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం - ఉగ్రవాది హఫీజ్ సయీద్ లు టార్గెట్ గా తదుపరి దాడులు జరపాలని సైన్యానికి ఆయన సూచించారు. పాక్ కు తొలిసారిగా చెప్పుదెబ్బలాంటి సమాధానం చెప్పామని రాందేవ్ బాబా అన్నారు.
మరోవైపు ఆధారాలు చూపాలంటున్న విపక్షాల డిమాండ్లపైనా ఆయన మాట్లాడుతూ... పాక్ ఎప్పుడూ అబద్ధాలు చెబుతూనే ఉంటుందని, పీవోకేలో భారత సైన్యం దాడులే జరపలేదంటూ ఉగ్రవాదుల మృతదేహాలను అక్కడినుంచి తరలించిందని ఆయన అన్నారు. ఆ దాడికి సంబంధించిన ఆధారాలు - వీడియో ఫుటేజి సర్కారు వద్ద ఉన్నాయని.. ఆ ఆధారాలను బయట పెడితే భారత సైన్య వ్యూహాలు బయటపడే ప్రమాదముందని.. కాబట్టి బయటపెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.
పాకిస్థాన్‌లోని యువత చదువుకుంటే ఉగ్రవాదులుగా మారబోరని.. పాకిస్థాన్ లో విద్యాభివృద్ధి కోసం భారతీయులంతా విరాళాలు ఇవ్వాలని ఆయన సూచించారు. పాక్ లో మన వైపు నుంచి అక్షరాస్యత కార్యక్రమం చేపడితే దానికి తమ పతంజలి సంస్థ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. అలాగే, చైనా అంశంపై స్పందించిన రాందేవ్ ఆ దేశం నుంచి భారత్‌కు వెన్నుపోటు తప్ప ఏమీ రాలేదని వ్యాఖ్యానించారు. చైనా ఉత్పత్తులను భారత్ బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి పాక్ - చైనాలపై యోగాబాబా స్ట్రయిక్సులో పతంజలి మార్కు బాగానే కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/