దుండగుల దాడితో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆందోళనలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో గాయపడిన జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిశీ ఘోష్ తోపాటు మరికొందరు బాధిత విద్యార్థులను బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పరామర్శించారు. నల్లదుస్తుల్లో అక్కడికి వచ్చిన దీపికా వారి నిరసనకు సంఘీభావం కూడా తెలిపారు. అయితే ఈ చర్యపై కొందరు దీపికాపై విమర్శలు చేయగా - మరి కొందరు ఆమెకి మద్దతు పలికారు. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త - యోగా గురువు బాబా రాందేవ్ సైతం స్పందించారు.
దీపిక మద్దతుపై రాందేవ్ బాబా చురకలు అంటించారు. ``దేశంలో రెండు కోట్లకి పైగా వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ - ఎన్ ఆర్ సీ అమలు ద్వారా - అక్రమ వలసలను అరికట్టే అవకాశం ఉంటుంది. అయితే, కొందరు సొంత ప్రయోజనాల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఇది దేశానికి మంచి కాదు`అని స్పష్టం చేశారు. ``ఏదైన విషయం గురించి మాట్లాడే ముందు - దేశ సామాజిక - ఆర్ధిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. తెలియకపోతే ఎవరైన సలహాదారుడిని నియమించుకొని తెలుసుకునే ప్రయత్నం చేయాలి` అని దీపికాకి సూచించారు.
కాగా, ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు సైతం దీపికపై ఘాటుగా రియాక్టయ్యారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పరోక్షంగా దీపిక తీరుపై స్పందించారు. ‘సీఆర్పీఎఫ్ జవాన్ చనిపోయిన ప్రతిసారీ పండగచేసుకుంటోన్న వాళ్లకు మీరు మద్దతు తెలుపుతున్నారనే విషయం మీకు తెలుసు .కొంత మంది అమ్మాయిలను వారి ప్రైవేట్ పార్ట్స్ పై దాడిచేసిన వ్యక్తుల వెనుక తాను నిలబడుతున్నట్టు దీపికాకి కూడా తెలుసు. వాళ్లకు మద్దతుగా ఆమె నిలబడటం అనేది ఆమెకున్న హక్కు. అమ్మాయిలను కొట్టిన వ్యక్తుల వైపు నిలబడిన ఆమె హక్కును నేను ప్రశ్నించలేను. ‘వార్తలు చదివే వారు ఎవరైన తాము ఎవరి వైపు నిలబడాలో తెలుసు, ఎవరైతే భారత్ ను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారో వారివైపే నిలబడటానికి వెళ్తున్నామని తెలుసు`` అని దీపికాను ఉద్దేశించి స్మృతి ఇరానీ అన్నారు.