తరుచూ ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాలలో చిక్కుకునే రామ్ దేవ్ బాబా తాజాగా మరోమారు అలాంటి చిక్కులనే ఎదుర్కున్నారు. ప్రభుత్వం అనుమతి లేకుండా నేపాల్‌లోని ఒక ఆయుర్వేద కంపెనీలో రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ విషయాన్ని అత్యధిక సర్క్యులేషన్ గల కాంతిపూర్ డైలీ పత్రిక ప్రచురించింది. కలకలం సృష్టించిన ఈ వార్తపై రామ్ దేవ్ బాబా వివరణ ఇచ్చారు.
నేపాల్ లోని విదేశీ పెట్టుబడులు, సాంకేతిక బదిలీ చట్టం ప్రకారం విదేశీయులు ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే నేపాల్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు అనుమతిని గాని, పారిశ్రామిక శాఖ అనుమతిని గాని ముందుగా పొందాలి. నేపాల్ లో పెట్టుబడులు పెట్టేందుకు రామ్ దేవ్ ముందుగా అనుమతులు తీసుకోలేదని ఆ పత్రిక ప్రచురించింది. ఈ ఆరోపణలను రామ్ దేవ్ ఖండిస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక చట్టాలను ధిక్కరించి పెట్టుబడులు పెట్టలేదన్నారు. చట్ట ప్రకారం అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన తరువాతనే పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ప్రతిపాదిత పెట్టుబడులు పెట్టిం దని ప్రకటనలో తెలిపారు. నేపాల్ లోని పతంజలి యోగ పీఠం భారత్ నుంచి ఎటువంటి పెట్టు బడులు పొంద లేదన్నారు. నేపాల్‌కు చెందిన వ్యాపారవేత్త ఉపేంద్ర మహతో, ఆయన భార్య సమతలు పతంజలి యోగ పీఠ్ లో పెట్టుబడులు పెట్టారన్నారు. భవిష్యత్ లో ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే నేపాల్ చట్టాలకు అనుగుణంగానే అన్ని అనుమతులు పొందుతామని ప్రకటనలో పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/