రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని తక్షణం కూల్చాల్సిందే. ఇది తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు డిమాండ్. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని కారణం చెబుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను ప్రయోగించమని కూడా బాబు కేంద్రాన్ని కోరుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అదే 356 ఆర్టికల్ ని టీడీపీ తుదికంటా వ్యతిరేకించింది. ఒక విధంగా ఒకప్పటి కేంద్ర పాలకులకు టీడీపీ బలి అయింది కూడా. ప్రజలు ఎన్నుకున్న ఎన్టీయార్ సర్కార్ ని నాడు ఇందిరాగాంధీ కూలదోసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత 356 ఆర్టికల్ విషయంలో పూర్తి వ్యతిరేకంగా ఉన్న పార్టీ కూడా టీడీపీనే. అలాంటి పార్టీ ఇపుడు జగన్ సర్కార్ మీద ఆ కత్తి దూయమని కేంద్రాన్ని కోరుతోంది.
మరి కేంద్ర పెత్తనాన్ని నిరసిస్తాం, రాష్ట్రాలే నిజం, కేంద్రం మిధ్య అంటూ ఒకనాడు ఎన్టీయార్ ఎత్తుకున్న నినాదం ఏమైంది ఇపుడు అన్నదే ప్రశ్న. చంద్రబాబు సైతం రాష్ట్రాల అధికారల్లోకి కేంద్రం జోక్యం అంటూ తాను సీఎం గా ఉన్న రోజుల్లో గట్టిగానే మాట్లాడుతూ వచ్చారు. ఇపుడు ఆయనది ప్రభుత్వం కాకపోతే మాత్రం రాష్ట్రాల అధికారాలలోకి కేంద్రం రావచ్చా. ఇలా టీడీపీ మూల సిద్ధాంతాలను, విధానాలను తమ రాజకీయ అవసరాల కోసం ఎప్పటికపుడు మార్చుకోవడం టీడీపీకి కొత్త ఏమీ కాదు, 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్న టీడీపీ ఏపీలో సీబీఐ ని నిషేధించింది. ఇక విపక్షంలోకి వచ్చాక చంద్రబాబు మాత్రం సీబీఐ విచారణను ప్రతీ విషయంలో ఈ రోజుకూ డిమాండ్ చేస్తూంటారని ప్రత్యర్ధులు విమర్శించారు అంటే అర్ధముందిగా.
ఇదే చంద్రబాబు సర్కార్ ఏలుబడిలో తిరుపతికి తమ కుటుంబంతో సహా అమిత్ షా దర్శనానికి వస్తే ఆయన కారు మీద టీడీపీ వారు దాడి చేశారు అని పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అలాగే దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ ఏపీకి వస్తే నల్ల జెండాలతో నిరసన తెలిపి నానా యాగీ చేసినపుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు పదిలంగా ఉన్నట్లా అని కూడా ప్రత్యర్ధులు అడిగితే సమాధానం టీడీపీ పెద్దల వద్ద ఉందా. ఇక ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు సహా సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు వంటి వారు కోరుతున్నారు. కేంద్రం వారు కోరినట్లుగా పెట్టేస్తుందా. అందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయా అంటే లేవు అనే జవాబు వస్తుంది.
ఇంతకంటే పదింతలు పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ కి మధ్య గొడవలు రోజూ జరుగుతున్నాయి. అక్కడే రాష్ట్రపతిపాలన పెట్టడంలేదు. పైగా అక్కడ బీజేపీ నేతల మీదనే టీఎంసీ పార్టీ ఉక్కుపాదం మోపుతోంది. అయినా రాష్ట్రపతిపాలన పెట్టడానికి రాజకీయ కారణాలు చూసుకుంటారా, అవి సరిపోతాయా అని కూడా ఆలోచించాల్సిందే అంటున్నారు మేధావులు. టీడీపీ వైసీపీల మధ్యన రాజకీయ సమరం ఇపుడు పీక్స్ కి చేరుకుంది అంతే తప్ప ఏపీలో దీని వల్ల జనాలకు ఏమీ జరగలేదు. ఎక్కడా లూటీలు, దొమ్మీలు అసలు జరగలేదు, రెండు పార్టీల మధ్య రాజకీయాలు బాగా ముదిరాయి అని మాత్రమే విశ్లేషిస్తున్నారు. ఇక కేంద్రంలో ఉన్న మోడీకి, అమిత్ షాలకు ఏపీ రాజకీయాలు అసలు తెలియవు అనుకుంటారా.
ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలని టీడీపీ కోరుతోంది, జనసేన సైతం కేంద్రం జోక్యం అడుగుతోంది. ఏపీ బీజేపీ మాత్రం దాడులను ఖండించి ఊరుకుంది. మిగిలిన పార్టీలు కూడా రాష్ట్రపతిపాలన అన్న మాటే అనడంలేదు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి పాలన అన్నది టీడీపీ షరా మామూలు డిమాండ్ గానే చూస్తున్నారు అనుకోవాలి. ఏది ఏమైనా ఏపీలో రాజకీయాలు బాగా హీటెక్కాయన్నదే అందరి మాటగా ఉంది.