జూనియర్ అయ్యన్నకు బాబు బంపర్ ఆఫర్.. బట్ వన్ కండిషన్...?

Update: 2022-10-07 12:42 GMT
ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో కీలకమైన నాయకుడుగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని చూశారు. ఆయన తరువాత వారసుడిగా చింతకాయల విజయ్ ముందుకు వస్తున్నారు. అయితే తన కుమారుడు విజయ్ ని నర్శీపట్నం సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అయ్యన్న తలచినా చంద్రబాబు మాత్రం అయ్యన్నే మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

దాంతో నిరుత్సాహపడిన విజయ్ కి చంద్రబాబు ఇపుడు బంపర్ ఆఫర్ ప్రకటించారని అంటున్నారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి అంటే విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన ఎంపీ సీటు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశమట. నిజంగా ఇది గోల్డెన్ ఆఫర్ గానే చూడాలి. అయితే జూనియర్ అయ్యన్నకు ఒక కండిషన్ బాబు పెట్టారని ప్రచారం అయితే సాగుతోంది.

ఆ కండిషన్ ఏమిటి అంటే అమరావతి రైతుల పాదయాత్రం విశాఖ జిల్లా మొత్తం మీద గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చూడాలని. ఈ బాధ్యతను కనుక అయ్యన్న కుమారుడు సక్సెస్ ఫుల్ గా నెరవేరిస్తే ఆయనకు విశాఖ ఎంపీ టికెట్ గ్యారంటీ అని టీడీపీ అధినాయకత్వం చెప్పినట్లుగా ప్రచారం అవుతోంది మరి. ఇదిలా ఉంటే జూనియర్ అయ్యన్న చంద్రబాబు కుమారుడు లోకేష్ తో బాగా సన్నిహితంగా ఉంటారు.

పైగా ఆయన టీడీపీని అనుకూలంగా ఐ టీడీపీ తరఫున పనిచేస్తున్నారు. ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్‌ను చూసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఐ టీడీపీకి మొత్తం సారధ్యం అంతా విజయ్ అనే అంటారు. వైసీపీ సర్కార్ మీద జగన్ మీద అనేక రకాలైన విమర్శలు కూడా అయ్యన్న కుటుంబం తరచూ అదే పనిగా  చేస్తూ ఉంటుంది. దాంతో ఏ టీడీపీ నేత వల్ల ఇంతలా ఇబ్బందులు పడని వైసీపీ  అయ్యన్న ఫ్యామిలీ టార్గెట్ తో విలవిలలాడుతోంది అంటున్నారు.

ఈ నేపధ్యంలో ఇపుడు ఉత్తరాంధ్రాలో అమరావతి రైతుల పాదయాత్ర సక్సెస్ కావడం అన్నది టీడీపీకి చాలా కీలకంగా ఉంది అంటున్నారు. మరి దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యతను అయ్యన్న కొడుకుతో పాటు పెందుర్తికి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మీద కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆ విధంగా పాదయాత్రను సక్సెస్ చేస్తే బండారు కుమారుడు అప్పలనాయుడుకు వచ్చే ఎన్నికల్లో పెందుర్తి టికెట్ ని ఇవ్వడానికి చంద్రబాబు మరో బంపర్ ఆఫర్ ని ఇచ్చారని అంటున్నారు.

నిజం చెప్పాలీ అంటే అటు అయ్యన్న కానీ ఇటు బండారు కానీ తమ వారసులకు వచ్చే ఎన్నికల్లో  టికెట్లు కావాలని కోరుతున్నారు. అయితే అదంతా ఈజీగా ఇవ్వలేమని చెప్పి చంద్రబాబు బిగ్ బాస్ తరహాలో ఒక బిగ్ టాస్క్ నే ఈ ఇద్దరు మాజీ మంత్రుల కుటుంబాల మీద పెట్టారని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో అమరావతి రైతుల పాదయాత్ర సూపర్ సక్సెస్ కావడం టీడీపీకి రాజకీయంగా చాలా అవసరం. విశాఖలో రాజధాని యావ ధ్యాస లేదని చెప్పడం ద్వారా అమరాతికే ఏపీ మొత్తం జై కొట్టింది అని చెప్పుకోవడానికే ఈ పాదయాత్ర అన్నది తెలిసిందే.

అయితే వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కానీ పాదయాత్రను సాఫీగా జరగనిచ్చేట్లుగా లేరు అని అంటున్నారు. దాంతో చంద్రబాబు సరికొత్త ఎత్తుగడ వేశారని, ఇలా సీట్ల ఆఫర్ తో తమ్ముళ్లను ఆకట్టుకుని అమరావతి పాదయాత్రను విజయవంతం చేయడానికి చూస్తున్నారని అంటున్నారు. మరి అటు జూనియర్ అయ్యన్న, ఇటు జూనియర్ బండారు, తెర వెనక ఇద్దరు మాజీ మంత్రులు కలసి అమరావతి రైతుల పాదయాత్రను దిగ్విజయం  చేయించగలరా. విశాఖ జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర టాప్ రేపింది అని అనిపించగలరా. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News