తెలంగాణ' చీడ పురుగు' కేసీఆర్!

Update: 2018-10-24 13:39 GMT
అందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, కేసీఆర్ కు స‌న్నిహితుడు బాబు మోహ‌న్ కు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న తీవ్ర అసంతృప్తికి గురైన సంగ‌తి తెలిసిందే. త‌న‌పై టీఆర్ ఎస్ పెద్ద‌లు వివ‌క్ష చూపుతున్నార‌ని, త‌న‌కు టికెట్ కేటాయించ‌లేద‌ని ఆరోపించిన బాబూ మోహ‌న్....కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. ఆ త‌ర్వాత కేసీఆర్ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌పంచంలో సెక్ర‌టేరియ‌ట్ కు వెళ్ల‌కుండా ప‌రిపాల‌న సాగించిన ఏకైక ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు...మంత్రుల‌కు కూడా క‌న‌ప‌డ‌కుండా మ‌సుగేసుకొని ఫామ్ హౌస్ లో కూర్చున్న సీఎం కేసీఆర్ అని దుయ్య‌బ‌ట్టారు. తాజాగా, మ‌రోసారి కేసీఆర్ పై బాబు మోహ‌న్ విరుచుకు ప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు కేసీఆర్ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్‌ దళితుల్ని అవమానిస్తున్నారని, దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పిన‌ కేసీఆర్....నలుగురు దళితులను మోసం చేశారని బాబు మోహ‌న్  ఆరోపించారు.

కేసీఆర్ దళిత వ్యతిరేకి అని ఆయ‌న మండిప‌డ్డారు. సూది, దారం, చెక్కర అంటూ దర్జీల మనోభావాలను దెబ్బతీసేలా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. మ‌హారాజులకు బట్టలు కుట్టిన చరిత్ర దర్జీలదని ఆయ‌న అన్నారు. కాగా, గ‌తంలో కూడా కేసీఆర్ పై బాబు మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో లా అండ్ ఆర్డర్ లేద‌ని - న‌డిరోడ్డుపై ఎన్నో హ‌త్య‌లు జ‌రుగుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న ఫార్మ్ హౌస్ కు జానెడు దూరంలో ఉన్న కొండ‌గ‌ట్టు ద‌గ్గ‌ర‌కు వెళ్లి క్ష‌త‌గాత్రుల‌ను కేసీఆర్ ప‌రామ‌ర్శించ‌లేద‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌వాబు చెప్పాలని, ఆయ‌న కోసం సామాన్యుల‌తో పాటు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఎమ్మెల్యేలు - మంత్రులు కూడా ...ప‌డిగాపులు కాశార‌ని అన్నారు. ప‌గ‌లు క‌లిసేందుకు స‌మ‌యం ఇవ్వ‌ర‌ని - చీక‌టి ప‌డ్డ త‌ర్వాత అస‌లు క‌న‌ప‌డ‌కుండా వెళ్లిపోతార‌ని అన్నారు. అలా గంట‌ల కొద్దీ వేచి చూసి నిరాశ‌తో వెనుదిరిగిన ఎమ్మెల్యేలు - మంత్రుల‌ను తాను చూశాన‌ని, ...వారిలో తాను కూడా ఉన్నానని మండిప‌డ్డారు.
Tags:    

Similar News