బాబు పేరు లాక్ డౌన్..పాప పేరు కరోనా..ఏంటి నమ్మడం లేదా ? ఇది చుడండి!

Update: 2020-04-02 21:30 GMT
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీనితో చాలామంది అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. దీనితో ఇప్పుడు  కరోనా వైరస్, లాక్ డౌన్  అనే  పదాలు వింటే ప్రజల భయంతో వణికిపోతున్నారు. తమ జీవితంలో మళ్ళీ ఈ రెండు పడాలని వినకూడదు అని , ఇలాంటి పరిస్థితులు చూడకూడదని అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. అయితే, అలాంటి పేర్లను పిల్లలకు పెట్టారు తల్లిదండ్రులు. ఇది ఎక్కడో కాదు. మన భారతదేశంలోనే జరిగింది.

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తర్ ప్రదేశ్‌ లో ఈ ఘటన జరిగింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలో ఖుకుందు గ్రామంలో మార్చి 30వ తేదీన ఓ బాబు పుట్టాడు. ఆ పసిబిడ్డకు తల్లిదండ్రులు లాక్ డౌన్ అని అతడి తల్లిదండ్రులు పేరు పెట్టారు. అతడు లాక్ డౌన్ సమయంలో పుట్టాడు. కరోనా వైరస్‌ ను కట్టడి చేయడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ ప్రకటించారు. దేశ ప్రజల క్షేమం కోసం మోదీ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని మా బాబుకు పెట్టాం అని ఆ బాలుడి తండ్రి పవన్ చెప్పారు. అలాగే అబ్బాయి పుట్టిన ఆనందం ఉన్నా.. తమ సెలబ్రేషన్స్‌ ను లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నట్టు చెప్పారు

ఇక ఇదే రాష్ట్రంలో  మరో చోట మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజున యూపీలోని గోరఖ్‌ పూర్‌ లో పుట్టిన పసిబిడ్డకు ఆ బాలిక మేనమామ నీతిష్ త్రిపాఠీ ‘కరోనా’ అని పేరు పెట్టాడు. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఐక్యం చేసిందని తెలిపాడు. అలాగే, ఎన్నో మంచి అలవాట్లు కూడా నేర్పిందని చెప్పాడు. కరోనా అనే మహమ్మారి మీద పోరాటాన్ని ఈ బాలిక గుర్తు చేస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. ఏదేమైనా కూడా ఈ కరోనా, లాక్  డౌన్ పేర్లను పెట్టడాన్ని పలువురు  నెటిజన్స్ స్వాగతిస్తున్నారు.
Tags:    

Similar News