బ్యాక్ టు బ్యాక్: జగనన్నే మన భవిష్యత్తు.. జగనన్నకు చెబుదాం!
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. 2019లో జరిగినఅసెంబ్లీ ఎన్నికల కీలక పోలింగ్ ఏప్రిల్ రెండో వారంలో జరగటం తెలిసిందే.కట్ చేస్తే సరిగ్గా ఏడాది సమయం ఉన్నట్లుగా కనిపించినా. ఎన్నికల నోటిఫికేషన్ లాంటి వాటిని పరిగణ లోకి తీసుకుంటే. మరో తొమ్మిదినెలలు మాత్రమే సమయం ఉందని చెప్పాలి. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి ఎన్నికల జ్వరం అందరిని ఆవహిస్తుందన్న నిజాన్ని మర్చిపోకూడదు.
ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేస్తున్న నేపథ్యంలో.. పాలనా రథాన్ని మరింత వేగంగా దౌడు తీయించేందుకు వీలుగా ఏపీ అధికారపక్షం అస్త్రశస్త్రాల్నిసిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సరికొత్తగా సిద్ధం చేసిన రెండు అస్త్రాలను ఏపీ అధికార పార్టీ అధినేత జగన్ స్వయంగా వెల్లడించారు. ఈ రెండు పథకాలకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తన పేరు మీద నిర్వహించే ఈ పథకాలను తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.
ఇందులో మొదటిది ఈ నెల ఏడో తేదీనుంచి మొదలు కానుంది. 'జగనన్నే మన భవిష్యత్తు' పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు చేరువ చేసే కార్యక్రమాన్ని చేపట్టటంతోపాటు.. సచివాలయాల కన్వీనర్.. గ్రహ సారథుల్ని ఏకం చేసి ఈ కార్యక్రమాన్ని నరి్వహించారు. ఈ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఏప్రిల్ 7న మొదలయ్యే ఈ ప్రోగ్రాం ఏప్రిల్ 20 వరకు సాగనుంది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన గ్రౌండ్ జీరో కార్యక్రమంగా దీన్ని చెప్పాలి.
ఇక.. ఏప్రిల్ 13న మరో కీలకకార్యక్రమాన్ని ప్రకటించారు. 'జగనన్న కు చెబుదాం' పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో రేషన్ కార్డు స్ప్లిట్ కాకపోవటం లాంటి సమస్యలు మొదలు.. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రికే నేరు గా తమ సమస్యల్ని చెప్పుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయటమే లక్ష్యంగా డిజైన్ చేశారు. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళలో చేపట్టిన ఈ కార్యక్రమాలు ప్రభుత్వానికి సరికొత్త అస్త్రాలుగా మారతాయని భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.