క్షేత్రస్థాయిలో పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పంజాబ్ ఎన్నికల గురించి ఏ మీడియాలో చూసినా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)-కాంగ్రెస్ మధ్యే పోటీ అన్నట్లుగా వార్తలు, కథనాలు కనబడుతున్నాయి. పోలింగ్ కు ఇక ఉన్నది 24 గంటలు గడువు మాత్రమే. ఈ నేపధ్యంలోనే ఢిల్లీ కేంద్రంగా ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంట్లో పంజాబ్ కు చెందిన కొందరు సిక్కు ప్రముఖుల భేటీ జరిగింది.
నాలుగు రోజుల క్రితమే నరేంద్ర మోడీ పంజాబ్ లో ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఆ పర్యటన పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాంతో లాభం లేదని చివరి అవకాశంగా ఏకంగా ప్రధానమంత్రే సిక్కు ప్రముఖుల్లోని కొందరితో సమావేశమయ్యారు. ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాల్సిందిగా అభ్యర్ధించారు. ఇప్పటికే శిరోమణి అకాలీదళ్-బీఎస్పీ కూటమి ఒకటి పోటీ చేస్తోంది. అకాలీదళ్ అంటేనే సిక్కులకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా ముద్ర పడింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ కూడా సిక్కే. పైగా పీసీసీ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్ధూ కూడా సిక్కే కావడం ఆ పార్టీకి కలిసివస్తుందనటంలో సందేహంలేదు. కాబట్టి చాలామంది సిక్కు ప్రముఖులు కాంగ్రెస్ తో ప్రయాణం చేస్తున్నారు. అలాగే ఆప్ అధ్యక్షుడు భగవంత్ సింగ్ మాన్ కూడా సిక్కే. మాన్ కు కూడా జనాల్లో మంచి పేరుంది. ఏదేళ్ళుగా ఆప్ మంచి ప్రతిపక్షంగా పనిచేస్తున్నది అనిపించుకున్నది.
ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేకంగా సిక్కు ప్రముఖులతో మోదీ సమావేశం నిర్వహించినందు వల్ల పెద్దగా ఉపయోగం ఉండదనే అనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆధ్వర్యంలోని పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నా పెద్దగా ఉపయోగం ఉన్నట్లు కనబడలేదు. అందుకనే ప్రత్యేకంగా ప్రధాని సమావేశమయ్యారు. ఈ సమావేశం ఏదో ఓ పదిరోజుల ముందే జరిపుంటే బాగుండేదేమో.
20వ తేదీన పోలింగ్ పెట్టుకుని 18వ తేదీన సమావేశం పెట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది ? మొత్తం మీద బీజేపీకి ఈ ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు కనబడుతున్నట్లే ఉంది.