మంగ‌ళ‌గిరిలో `బాదుడే బాద‌ుడు`

Update: 2022-07-28 01:30 GMT
'బాదుడే బాదుడు' కార్యక్రమలో భాగంగా.. మంగళగిరి నియోజకవర్గంలోని రత్నాల చెరువు 22వ వార్డులోని ప్రజలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలకరించారు. వారి సమస్యలపై ఆరా తీశారు. వైసీపీ-టీడీపీ పాలనలో నిత్యావసరాల ధరలు ఏవిధంగా ఉండేవో తెలిపేలా కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో వారికి వివరించారు. టీడీపీ హయాంలో పింఛన్‌ పెంచి ప్రజలను ఎలా ఆదుకుందో తెలిపారు.

పేద, మధ్య తరగతి కుటుంబాలకు టీడీపీ పాలనలో 4వేల రూపాయలు మిగులు ఉంటే, వైసీపీ పాలనలో 9వేల రూపాయలు లోటు ఉంటోందని  లోకేశ్ ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.

'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పట్టణం 22వ వార్డులోని రత్నాలచెరువులో పర్యటించిన ఆయన.. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో ప్రజలపై పడుతున్న భారం వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. నిత్యావసర ధరలు, చెత్త పన్ను, ఇంటి పన్నులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు.

ఇటీవల మరణించిన, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. రత్నాల చెరువు ప్రాంతంలోని చేనేత మగ్గం షెడ్లను పరిశీలించారు. ప్రతి ఏడాది వర్షాకాలం మగ్గాల్లోకి నీరు రావడం వలన ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని..'నేతన్న నేస్తం' కూడా కేవలం సొంత మగ్గాలు ఉన్న వారికే అందుతోందని లోకేశ్ దృష్టికి తెచ్చారు.

ఉపాధి లేని సమయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని వాపోయారు. పోలియోతో బాధపడుతున్న తన మూడో కూతురుకు వీల్ చైర్ సాయం చేయాలని రాజేశ్వరి కుటుంబం కోరగా వెంటనే స్పందించిన లోకేశ్.. తెలుగుదేశం పార్టీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తుందని హామీ ఇచ్చారు. లోకేష్ వెంట భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. అడుగ‌డుగునా.. మ‌హిళ‌లు, యువ‌త ఆయ‌న స్వాగ‌తాలు ప‌ల‌క‌డం.. నియోజ‌క‌వ‌ర్గంలో మారుతున్న ప‌రిణామాల‌కు, రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని.. నాయ‌కులు వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News