ఎఫ్ ఆర్వో అనితపై దాడికేసు: ఎమ్మెల్యే సోదరుడికి నో బెయిల్

Update: 2019-08-07 07:48 GMT
తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా సార్సాల గ్రామంలో గిరిజనులు పోడుచేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్ అనితపై టీఆర్ ఎస్ ఎమ్మెల్యే సోదరుడి దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో జైల్లో ఉన్న కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణకు తాజాగా బెయిల్ మంజూరు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

ఈ దాడి ఘటన రాష్ట్రంతోపాటు ఢిల్లీ పెద్దలను కదిలిచింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం - మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు తీవ్రత దృష్ట్యాతోపాటు ఎఫ్ ఆర్వో అనిత భద్రత దృష్ట్యానే ఈ దాడి కేసులో కోనేరు కృష్ణకు బెయిల్ మంజూరు చేయలేమని హైకోర్టు చీఫ్ జస్టిస్ గండికోట శ్రీదేవి స్పష్టం చేశారు. కోనేరు కృష్ణ పెట్టుకున్న పిటీషన్ కొట్టివేసింది. కాగా కోనేరు కృష్ణతోపాటు దాడిలో పాల్గొన్న మిగతా 22మందికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కాగా తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ భూముల్లో మొక్కలు నాటాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత నెలరోజుల క్రితం నిర్ణయించింది. కాగజ్ నగర్ ప్రాంతంలోని సార్సాలా గ్రామంలో 20 హెక్టార్ల గిరిజనులు సాగుచేసుకుంటున్న భూమిని ఎంపిక చేసి ట్రాక్టర్లను తీసుకొని వెళ్లింది. అప్పుడే జడ్పీ వైస్ చైర్మన్ అయిన కోనేరు కోనప్ప గిరిజనులు - నాయకులతో కలిసి అక్కడి చేరుకొని అటవీ శాఖ అధికారులను కర్రలతో చితకబాదారు. అధికారులపై దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది.


Tags:    

Similar News