బాలయ్యతో ఎన్టీఆర్‌ ఘాట్‌ కు సుహాసిని.

Update: 2019-01-18 12:45 GMT
కూకట్‌ పల్లిలో నందమూరి సుహాసిని ఓడిపోయిన తర్వాత ఆమెపై సింపతీ బాగా వర్కవుట్‌ అయ్యింది. చంద్రబాబు రాజకీయానికి ఆమె బలైపోయిందని అందరూ ఫీలయ్యారు. దీనికితోడు ప్రెస్‌మీట్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సుహాసిని పేరు ప్రస్తావించారు. దీంతో.. సుహాసిని త్వరలో కారెక్కబోతుందని.. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. వీటితోపాటు.. చంద్రబాబుకు చెక్‌ పెట్టేందుకు సుహాసినిని తమ పార్టీలో కేసీఆర్‌ చేర్చుకోబోతున్నారని పుకార్లు సోషల్‌ మీడియాలో షికార్లు చేశాయి.

పుకార్లు అయితే వస్తున్నాయి కానీ అధికారికంగా సుహాసిని మాత్రం మీడియా ముందుకు వచ్చి ఏ విషయం చెప్పలేదు. మిగిలిన టీడీపీ శ్రేణులు మాత్రం సుహాసిని టీడీపీలోనే ఉంటారని చెప్పారు తప్ప…ఆమె మాత్రం ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఇక ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్బంగా.. ఎన్టీఆర్‌ ఘాట్‌ కు బాలకృష్ణతో కలిసి వచ్చారు సుహాసిని. మెడలో టీడీపీ కండువా కూడా ఉంది. దీంతో..తాను టీఆర్‌ ఎస్‌ లోకి వెళ్లడం లేదని.. టీడీపీలో ఉంటానని చెప్పకనే రూమర్స్‌కి చెక్‌ పెట్టారు నందమూరి సుహాసిని.


Full View

Tags:    

Similar News