బస్సెక్కి వచ్చిన బాలయ్య

Update: 2015-10-22 06:10 GMT
    అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి స్వర్గీయ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యలందరూ బయలుదేరారు. హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చి గన్నవరంలో వారు దిగారు. అక్కడి నుంచి వారంతా మూడు ప్రత్యేక బస్సుల్లో సభా ప్రాంగణానికి వచ్చారు. కాగా అందరిలోనూ బాలయ్య డిఫరెంటుగా కనిపించారు. భుజాన బ్యాగు వేసుకుని స్టైలిస్ లుక్ తో ఆయన అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. దారిపొడవునా అభిమానులకు అభివాదం చేస్తూ సాగారు.

మరోవైపు శంకుస్థాపన సందర్భంగా సభా ప్రాంగణం కోలాహాలంగామారింది. వివిధ రాజకీయ వీఐపీలు, ప్రముఖులు, ప్రజల రాక సందర్భంగా కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనాలతో సభా ప్రాంగణం నిండిపోయింది. ఇంకా ప్రముఖులు, వీఐపీల, అధికారుల తాకిడి ఎక్కువైంది.   అమరావతి శంకుస్థాపన మహోత్సవ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఒక కటౌట్ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగుదేశం వ్యవస్థాపకు అధ్యక్షుడు ఎన్టీరామారావు, తెలుగుదేశం అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ ముగ్గురూ ఉన్న కటౌట్ సభకు వచ్చిన వారందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నది. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీ ఆర్ వీరిరువురినీ ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న ఆ కటౌట్ ను చూసి తెలుగుదేశం వీరాభిమానులు ముచ్చటపడుతున్నారు.


Buy Bricks Online and Contribute to Amaravathi : http://amaravati.gov.in/EBRICKS/Index.aspx
Tags:    

Similar News