కలేర్నూలు జిల్లాలో బలమైన నేతగా పేరున్న భూమా నాగిరెడ్డి ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. నిజానికి భూమాకు టీడీపీ కొత్తేం కాదు. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఆయన.. విపక్ష నేతగా ఉండటం ఇష్టం లేక ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయినప్పటికీ ఆయన కోరుకున్నట్లుగా అధికారం దక్కలేదు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జగన్ కు సన్నిహితంగా ఉన్న భూమా.. గత కొద్దికాలంగా ఏ మాత్రం సఖ్యతగా లేరన్న మాట వినిపిస్తోంది. దీనికి జగన్ వైఖరి కూడా కారణంగా చెబుతున్నారు. ఆ మధ్య జరిగిన కోఆపరేటివ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. దీనికి భూమాను బాధ్యుడ్ని చేస్తూ జగన్ నాలుగు మాటలు అన్నట్లు చెబుతారు. అప్పటి నుంచి పార్టీ అధినేతపై తీవ్రస్తాయిలో అసంతృప్తిలో ఉన్న ఆయన్ను.. టైం చూసుకొని మరీ చంద్రబాబు బావమరిది కమ్ వియ్యంకుడైన బాలకృష్ణ చక్రం తిప్పినట్లుగా చెబుతున్నారు .
మొదటి నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో మంచి సంబంధాలున్న భూమాను.. బాలయ్యే నేరుగా టచ్ లోకి వెళ్లటం.. సైకిల్ లోకి వచ్చేందుకు ఆయన వెనుకుండి కథ నడిపించినట్లుగా చెబుతున్నారు. బాలయ్యతో పాటు.. ఆయన అల్లుడు లోకేశ్ రంగంలోకి దిగటం.. భూమా.. ఆయన కుమార్తె రాజకీయ భవిష్యత్తుకు భారీ భరోసా ఇవ్వటంతో భూమా పార్టీ మారేందుకు ఓకే చెప్పారని చెబుతున్నారు. భూమా ఎపిసోడ్ మొత్తాన్ని బాలయ్య ముందుండి నడిపించినట్లుగా చెబుతున్నారు.