టీడీపీ కీలక నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే, బాలయ్య ఎప్పుడో కానీ.. రాజకీయాల గురించి మాట్లాడరు. ఎన్నికల సమయంలో అయినా.. తన సీటు కోసం.. ప్రచారం చేసుకుంటారు. అంతకు మించి.. ఆయన ఎప్పుడు బయటకు వచ్చిన సందర్భాలు లేవు. కానీ, ఏపీలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తొలిసారి.. తనకు సంబంధం లేకపోయినా..పార్టీ కోసం.. ఆయన ప్రచారానికి ముందుకు వచ్చారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి బుద్ధి చెప్పాలని.. ఆయన పార్టీ నాయకులకు మాత్రమే కాదు.. మేధావులు, విద్యావంతులకు కూడా పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆయన సెల్పీ వీడియోను తీసుకుని.. బాలయ్య సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి కారణం.. ఏపీలో త్వరలోనే గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే.. వారిని గెలిపించాలని బాలయ్య పిలుపునిచ్చారు.
పశ్చిమ సీమ జిల్లాలకు సంబంధించి జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి టీడీపీ తరఫున(మద్దతు) పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య తొలిసారి స్పందించారు.
ఉన్నత విద్యావంతుడైన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. పట్టబద్రులంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశధోరణి అవలంభిస్తుందని బాలకృష్ణ ఆరోపించారు.
ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు.. ఇదే తొలి అవకాశమని బాలయ్య తెలిపారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని అన్నారు. ''ప్రభుత్వం వ్యవస్థలను అణిచేస్తోంది. అణదొక్కేస్తోంది. ఇప్పుడు.. ప్రబుత్వానికి బుద్ధి చెప్పే అవకావం వచ్చింది. ఎప్పుడో వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి ఇది నాంది కావాలి'' అని బాలయ్య పిలుపునిచ్చారు.
మొదటి ప్రాధాన్యతా ఓటును భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి వేయాలని సూచించారు. ఆయన పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారని.. క్రమశిక్షణా సంఘంలో బాధ్యలు నిర్వహిస్తున్నారని.. మేధావి అని.. పేర్కొన్నారు. ఆయనను గెలిపించుకోవడం.. ద్వారా.. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని.. బాలయ్య పిలుపునిచ్చారు. కాగా, ఇప్పటి వరకు.. ఏ ఎన్నికలోనూ.. బాలయ్య ఇలా పిలుపునివ్వకపోవడం గమనార్హం. అంతేకాదు.. తాజాగా సెల్పవీడియో విడుదల చేయడం ఆసక్తిగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.