ఏపీ మంత్రివర్గ విస్తరణ...బాబు వరుస భేటీలు
సుదీర్ఘ కాలం సస్పెన్స్ తర్వాత తేదీ ఖరారైన ఏపీ మంత్రివర్గ విస్తరణలో మరో ఎపిసోడ్ మొదలైంది. ఎవరిని తొలగించాలి, ఎవరికి చాన్స్ కల్పించాలి అనే చర్చ పతాకస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో అధిష్టానం ఎవరికి ఉద్వాసన ఇవ్వనుందో ఇప్పటి వరకూ ఎవరికి సరైన సమాచారం అందలేదు. కాని వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన నలుగురికి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నలుగురికి కేబినెట్‌లో స్థానం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఆరుగురి పదవులు ఊడి మరికొందరికి చాన్స్ ఖాయమంటున్నారు. తద్వారా కేబినెట్ మంత్రుల సంఖ్య 26కు చేరనుందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం పదవుల్లో ఉన్న మంత్రులతో పాటుగా పదవిని ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతుంది.
ఏపీ కేబినెట్ కూర్పుపై నేటి రాత్రికి స్పష్టత రానుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో మంతనాలు జరిపి తమకు కేబినెట్‌లో స్థానం కల్పించవలసిందిగా కోరినట్లు తెలుస్తోంది. పదవి గండం ఉన్న మంత్రులంతా తమ పదవి ఉంటుందో ఊడుతుందోనని టెన్షన్‌తో మంత్రి వర్గ జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి వర్గ విస్తరణతో టీడీపీ నేతల్లో విబేధాలు భగ్గుమంటున్నాయి. కాగా, అదే సమయంలో సచివాలయ సమీపంలో మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి రేపు గవర్నర్ నరసింహన్ తిరుపతి నుంచి విజయవాడ చేరుకోనున్నారు.
కాగా, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం చంద్రబాబునాయుడితో సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో బాబుతో బాలయ్య సమావేశమై పలు అంశాలు చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి మాత్రం అన్ని శాఖలను భర్తీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం. మరి ఎవరి పదవులు ఉంటాయో..ఎవరి పదవులు ఊడతాయో..ఎవరు కొత్తగా కేబినెట్‌లో అడుగుపెడతారో వేచిచూడాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/