నారా రోహిత్ హీరోగా నటించిన సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే - ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ మరోమారు స్పందించారు. ఆడియో ఫంక్షన్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపిన నేపథ్యంలో తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలని ఇప్పటికే కోరిన బాలయ్య మరోమారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివరణ ఇచ్చారు.
మహిళా దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...మహిళలంటే తనకు మొదట్నుంచి అపార గౌరవముందని పునరుద్ఘాటించారు. ఏ ఇంటి ఆడపడుచైనా..తమ ఇంటి ఆడపడుచులాగా చూడటం తమ సంప్రదాయమన్నారు. మహిళల్ని తోబుట్టువులుగా చూడటం తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిందని బాలకృష్ణ చెప్పారు. ‘సావిత్రి’ ఆడియో రిలీజ్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలు సరదాగా చేసినవే తప్ప ఎవరినీ ఉద్దేశించి కాదన్నారు. ఆడియో కార్యక్రమం కాబట్టి తాను ఆ విధంగా మాట్లాడానని పైపెచ్చు తన కామెంట్లను అక్కడికి వచ్చిన వారు ఆనందించారే తప్ప ఎవ్వరూ ఇబ్బంది పడలేదని చెప్పారు.