ఫోన్ ట్యాపింగ్ పై స్పందించిన బాల‌కృష్ణ‌

Update: 2015-06-10 16:04 GMT
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన ఓటుకు నోటు కేసు, ఆ క్ర‌మంలో చంద్రబాబు ఫోన్ ను ట్యాప్ చేయ‌డం అనే అంశాల‌పై హిందూపూర్ ఎమ్మెల్యే,  ప్రముఖ సినీ నటుడు నంద‌మూరి బాలకృష్ణ  స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ నిబంధ‌న‌ల‌కు విరుద్ద‌మ‌న్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు స‌రికాద‌ని అన్నారు. ట్యాపింగ్ చ‌ర్య కేసీఆర్‌ కుటిల రాజకీయాలకు నిదర్శనమని దుయ్య‌బ‌ట్టారు.
 
మ‌రోవైపు బాల‌కృష్ణ ఏపీ స‌చివాల‌యానికి వెళ్లారు. ఏపీ మంత్రి పరిటాల సునీత చాంబర్‌లో బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు జ‌రిపారు. బర్త్‌డే కేక్‌ కట్‌చేసి బాల‌కృష్ణ‌కు తినిపించారు. మంత్రులు సునిత‌, ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు ఈ సంద‌ర్భంగా పాల్గొన్నారు.
Tags:    

Similar News