సిట్ చెప్పినట్లు చేస్తే డబ్బున్నోళ్లకు చుక్కలే

Update: 2016-07-14 18:24 GMT
ఎవరెన్ని చెప్పినా.. ఎన్ని చట్టాలు తెచ్చిన డబ్బులున్నోళ్లను కట్టడి చేసేందుకు.. వారి బ్లాక్ మనీకి కట్టడి చేసే ఛాన్స్ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశంలో నల్లధన ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సింఫుల్ గా చెప్పాలంటే సిట్ కొన్ని సూచనలు చేసింది. వీటిని కానీ ప్రభుత్వం అమలు చేసిన పక్షంలో బ్లాక్ మనీ లావాదేవీలకు దాదాపుగా కట్టడి పడే అవకాశం ఉందని చెబుతున్నారు. సిట్ చేస్తున్న సిఫార్సుల్లో ఒక వ్యక్తి వద్ద వ్యక్తిగతంగా రూ.15 లక్షలకు మించిన నగదు ఉండకూడదు.

అంతేకాదు.. రూ.3లక్షలకు మించిన నగదు లావాదేవీలపైనా నిషేధాన్ని విధించాలని పేర్కొంది. అంతేకాదు.. రూ.3లక్షలకు మించిన లావాదేవీలను అక్రమమైనవిగా ప్రకటించి.. చట్టబద్ధంగా శిక్ష విధించాలని సిట్ కోరింది. నల్లధనాన్ని కట్టడి చేసేందుకు రిటైర్డ్ జడ్జి ఎంబీ షా నేతృత్వంలో సుప్రీంకోర్టు సిట్ ను నియమించిన సంగతి తెలిసిందే. నల్లధనాన్ని అదుపులోకి తీసుకురావటం.. దేశంలో పెద్ద ఎత్తున పోగుపడి.. ప్రభుత్వ లెక్కల్లోకి రాని సంపదను బయటకు తెచ్చేందుకు కఠినమైన చట్టాల అవసరం ఎంతైనా ఉంది. మరి.. తాజాగా సిట్ చేసిన సిఫార్సుల్ని చట్ట రూపంలోకి ఎంతవరకు తెస్తారో చూడాలి.
Tags:    

Similar News