కేరళ పోలీస్ అకాడెమీలో ట్రైనీ పోలీసులకి అందించే ఫుడ్ మెనూలో బీఫ్ ను తొలగించారు. దీనితో ఇప్పుడు సరికొత్త వివాదం రాజుకుంది. కేరళలో చాలా ప్రాముఖ్యత పాపులారిటీ ఉన్న డిష్ బీఫ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే , కొత్తగా పోలీస్ అకాడెమీలో శిక్షణ తీసుకునేందుకు వచ్చిన పోలీసులకు ఇచ్చిన ఫుడ్ మెనూలో బీఫ్ ను తొలగించారు. అయితే , బీఫ్ తప్ప - మిగిలిన అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలను ఫుడ్ మెనులో పొందుపర్చారు. దీనితో అన్ని రకాల నాన్ వెజ్ వంటలు ఉండగా ఒక్క బీఫ్ నే ఎందుకు తొలగించారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇదే సమయంలో ట్రైయినీ పోలీసులకు ఇచ్చిన మెనూలో బీఫ్‌ను కావాలనే తొలగించారనే విమర్శలు వస్తున్నాయి.
అయితే ట్రైనీ లకి k ఇచ్చిన మెనూలో బీఫ్ పై నిషేధం విధించలేదని - ప్రతి ఏడాది కొత్తగా అకాడమీకి శిక్షణ కోసం వచ్చే ట్రైనీ పోలీసులకు ఇచ్చే మెనూలో మార్పలు చేర్పులు జరుగుతుంటాయని - ఈ మార్పులు చేర్పులు డైటీషియన్ చెప్పే సలహాలు - సూచనల మేరకు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం రోజున విడుదల చేసిన మెనూ కూడా దానికి ఆ నియమాలకు లోబడే రూపొందించారు అని వెల్లడించారు. శిక్షణ తీసుకునేందుకు వచ్చిన ట్రైయినీలకు ఎంత కాలరీలు అవసరం అవుతాయన్నది పరిగణలోకి తీసుకుని మెనూను తయారు చేయడం జరిగిందని వివరణ ఇచ్చారు.
అయితే, బీఫ్ పై ఎలాంటి నిషేధం లేదని చెబుతూనే ఫుడ్ మెనూలో , బీఫ్ డిష్ ను తొలగించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే బీఫ్ పై నిషేధం విధించలేదని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి అధికారిక ప్రకటన జారీ అయ్యింది. ఇప్పటివరకు కేరళ పోలీస్ అకాడెమీలో వారానికి రెండు సార్లు బీఫ్ ను అందించేవారు. అయితే బీఫ్ పై నిషేధం విధించడం ఇది మొదటిసారి కాదు . గతంలో , 2015లో బీఫ్ పై అనధికారిక నిషేధం విధించడం జరిగింది. అప్పటి ఐజీ సురేష్ రాజ్ పురోహిత్ ఆదేశాల మేరకు పోలీస్ అకాడెమీలో బీఫ్ ను సర్వ్ చేయడం మానేశారు. కానీ , 2016లో పినరాయి విజయన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ అనధికారిక నిషేధంను ఎత్తివేసి, పోలీస్ అకాడమీ లో బీఫ్ ని సర్వ్ చేసారు. కానీ , తాజాగా మరోసారి ఫుడ్ మెనూ లో బీఫ్ లేకపోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో మరి ...