కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసే తొందరలో నిబంధనలేమీ పట్టించుకోకుండా పార్లమెంటులో దూకుడు చూపిన హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఇబ్బందుల్లో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పార్లమెంటులో భద్రత నిబంధనలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు కొన్ని ఇతర నిబంధనలూ ఉంటాయి. దాన్ని అందరూ పాటించాల్సిందే. ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. తాజాగా కార్తీక రెడ్డి అలా నిబంధనలు ఉల్లంఘించడంతో చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఎంపీ పాస్ పై పార్లమెంట్ సమావేశాలను వీక్షించేందుకు కార్తీకరెడ్డి ఈ రోజు పార్లమెంటుకు వెళ్లారు. అక్కడ గ్యాలరీ నుంచి సమావేశాలను వీక్షించారు. ఆ తర్వాత లోక్ సభ రేపటికి వాయిదా పడింది. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే అనూహ్యంగా అక్కడ కార్తీక ప్రత్యక్షమయ్యారు. భద్రతావలయాన్ని ఛేదించుకుని రాహుల్ వద్దకు కార్తీక రావడంతో, అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఆమె భద్రతా నిబంధనలను ఉల్లంఘించారని అధికారులు గుర్తించారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అంతేకాదు... ఆమె భద్రతా వలయాన్ని ఛేదించుకుని వెళ్లిన ఘటనపై పార్లమెంటు సెక్యూరిటీ వింగ్ విచారణ చేపట్టింది. మొత్తానికి రాహుల్ కలవాలనే తాపత్రయంతో ఆమె ఏమీ పట్టించుకోకుండా వ్యవహరించడంతో ఇప్పుడు చర్యలు ఎదుర్కోబోతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/