‘అలయ్- బలయ్’.....తెలంగాణ వ్యవహారిక సంప్రదాయం ప్రకారం ఆప్యాయ కలయికల వేదిక. విజయ దశమి సందర్భంగా బీజేపీ జాతీయ నాయకుడు - కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ గత పదమూడు ఏళ్లుగా నిర్వహిస్తున్న కార్యక్రమం. ఈ ఉత్సవానికి కేంద్ర - రాష్ట్ర మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్యేలు - వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు- పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ముఖ్య నేతలు - వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతుంటారు. అయితే గత సంవత్సరాలకు భిన్నంగా తాజాగా నిర్వహించిన ఈ కార్యక్రమం సాగిందని అంటున్నారు. ఏకంగా కేంద్రానికి సందేశం పంపేలా ఉందని చెప్తున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కాంగ్రెస్ నాయకుడు - మాజీ ఎంపీ వి. హనుమంత రావు ఆసక్తికరమైన కామెంట్ చేయగా....టీఆర్ ఎస్ పార్టీ ఎంపీ కే కేశవరావు దానికి మద్దతు పలికారు. అత్యంత ఆసక్తికరంగా టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా ఈ డిమాండ్ కు సంఘీభావం తెలిపారు. వీహెచ్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించడం వల్ల బీసీలంతా బాధపడ్డారని తెలిపారు. బీసీ నేతను మంత్రివర్గం నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. బీసీలు బాధ పడుతున్న విషయాన్ని ప్రధానికి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చెప్పాలంటూ ఆయన వేదికపై ఉన్న కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను కోరారు. టీఆర్ ఎస్ ఎంపీ కే కేశవరావు ప్రసంగిస్తూ దత్తాత్రేయకు పదవి ఉన్నా లేకున్నా ఆ గౌరవం ఉంటుందన్నారు. దత్తాత్రేయకు పదవి వల్ల పేరు రాదని - పదవికే వన్నె వస్తుందన్నారు. టీ.జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ప్రసంగిస్తూ వీహెచ్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని అన్నారు. కాగా, హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ మాట్లాడుతూ దత్తాత్రేయను తొలగించినందుకు బీసీలు ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదని, ప్రధాని మోడీయే బీసీ అని చెప్పారు. దత్తాత్రేయ సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని - ఆయనకు బంగారు భవిష్యత్తు ఉందని హామీ ఇచ్చారు. కేంద్ర కార్మిక - ఉపాధి కల్పనా శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రసంగిస్తూ దత్తాత్రేయ విశిష్ట కార్యాచరణతో రాజకీయనేతల మధ్య సఖ్యతకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
అలయ్ బలాయ్ రూపంలో తనకు తెలంగాణ రాజకీయాల్లో ఎంతటి క్లీన్ ఇమేజ్ ఉందో సాక్షాత్తు ఇద్దరు కేంద్రమంత్రుల సమక్షంలో దత్తాత్రేయ తేల్చిచెప్పినట్లు అయిందని రాజకీయవర్గాలు అంటున్నాయి. అయితే కేంద్రమంత్రులు చెప్పినట్లు మంచి మాటలేనా లేదంటే...నిజంగానే దత్తన్నకు పార్టీ కీలక పదవి అప్పగిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.