ముంద‌స్తు ప‌క్కా అన్న ద‌త్త‌న్న‌.. ఎందుకంటే?

Update: 2018-08-31 11:06 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ముంద‌స్తుకు వెళుతున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన వారంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌న్నీ ముంద‌స్తుకు అనుకూలంగానే సాగుతున్నాయి. అయితే.. కేసీఆర్ ఇప్ప‌టివ‌ర‌కూ ఆ విష‌యంపై మాట్లాడ‌ని నేప‌థ్యంలో.. ఆయ‌న ఎప్పుడు ముంద‌స్తు గురించి ప్ర‌స్తావిస్తారు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇదిలా ఉంటే.. ముంద‌స్తుపై మాజీ కేంద్ర‌మంత్రి బండారు ద‌త్తాత్రేయ తాజాగా ఓపెన్ అయ్యారు.

ఒక మీడియా సంస్థ‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడిన ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌లు త‌థ్య‌మ‌న్నారు. పార్టీని స‌మాయుత్తం చేయాల‌ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు  అమిత్ షా చెప్పిన‌ట్లుగా ఆయ‌న చెప్పారు. ఏపీలో జ‌రుగుతున్న సంఘ్ స‌మావేశాల‌కు అమిత్ షా హాజ‌రైన సంద‌ర్భంలో తాను వెళ్లి క‌లిశాన‌ని.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌కు ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం తాను ఎంపీగా ఉన్నా.. పార్టీ ఆదేశిస్తే తాను ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. ముంద‌స్తు నేప‌థ్యంలో రెండు నెల‌లుగా అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మొత్తానికి కేసీఆర్ చెప్పాల్సిన మాట‌ను ద‌త్త‌న్న చెప్ప‌టం.. ఆ విష‌యాన్ని త‌న‌కు అమిత్ షా ముందే చెప్పార‌న‌టం చూస్తుంటే.. కేసీఆర్ త‌న ప్లాన్ ను ముందే షాతో షేర్ చేసుకున్నారా? అన్న కొత్త సందేహం క‌లుగ‌క మాన‌దు.


Tags:    

Similar News