రాజకీయ నేతల వైఖరి విచిత్రంగా ఉంటుంది. తమ మాటలతో భావోద్వేగాన్ని హైపిచ్ లోకి తీసుకెళ్లే వారు.. వ్యక్తిగతంగా మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. రాజకీయం వేరు.. వ్యక్తిగతం వేరని సుద్దులు చెప్పేవారు.. మరి తమ మాటలతో సామాన్య ప్రజల వ్యక్తిగత జీవితాల మీద ఎలా ప్రభావం చూపిస్తారన్న మాటకు సూటి సమాధానం మాత్రం చెప్పరు. అదెలానంటారా?.. ఇప్పుడు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయనే తీసుకోండి. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు చాలా సన్నిహితుడు.
రాజకీయ విభేదాలకు అతీతంగా వారి బంధం నిలుస్తుంది. అదే కేసీఆర్.. అవసరమైతే బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టగల సమర్థత సొంతం. అదే సమయంలో బండారు దత్తాత్రేయ సైతం సైద్దాంతికంగా పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు కురిపిస్తారు. మరి.. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వారు.. తమ రాజకీయ వైరుధ్యానికి భిన్నంగా రాసుకుపూసుకు తిరుగుతుంటారు.
దురదృష్టకరమైన అంశం ఏమిటంటే.. ఈ ఇద్దరు నేతల ప్రసంగాలు విన్న సామాన్యులు మాత్రం చెలరేగిపోతుంటారు. వాదనలతో ఒకరిపై ఒకరు కోపతాపాలు పెంచుకుంటారు. తాము అభిమానించే వారిని సమర్థించేందుకు నానా పాట్లు పడుతుంటారు. అవసరమైతే.. తమకు వ్యక్తిగతంగా స్నేహితులైన వారి విషయంలోనూ గుర్రుగా ఉంటారు. నిజానికి ఇదే అసలుసిసలు రాజకీయంగా చెప్పాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తమ పార్టీ కానీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పారు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం మీద ఆయన చేసిన ఆవేశపూరిత వ్యాఖ్యల్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఆరేళ్ల కిందట (2010 ఆగస్టు 23న అచ్చు అయిన) ఒక ప్రముఖ మీడియా సంస్థలో ప్రచురితమైన కేసీఆర్ వ్యాఖ్యలతో కూడిన వార్తనే చూస్తే.. ‘‘సెప్టెంబరు 17న తెలంగాణ ప్రాంతం విముక్తి పొంది భారత దేశంలో విలీనమైంది. ఆ రోజే ఇక్కడి ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చారు. తెలంగాణ పరజల జీవితాలతో ముడిపడిన సెప్టెంబరు 17ను విముక్తి దినోత్సవంగా ప్రభుత్వమే నిర్వహించాలి. మహారాష్ట్ర.. కర్ణాటక రాష్ట్రాలు దీన్ని అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు మన రాష్ట్రానికి వచ్చిన సమస్య ఏమిటి?తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబందించిన విషయం ఇది. స్వాతంత్ర్య దినోత్సవాన్నికూడా జరపనప్పుడు ఇదేం స్వేచ్ఛ? 17న విముక్తి దినోత్సవాన్ని జరిపి తీరాల్సిందే. మువ్వెన్నెల జెండాను ఎగరేయాల్సిందే’’ అంటూ వీరావేశంతో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.
మరి.. అదే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. ఆరేళ్ల కిందట విముక్తి దినోత్సవం గురించి మాటలు చెప్పిన పెద్దమనిషి.. ఈ రోజు ఆ విషయం గురించి మాట్లాడుతున్నదే లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తాజాగా బీజేపీ సీనియర్ నేత.. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కేసీఆర్ మీద విమర్శలు చేశారు. కేసీఆర్ మాట మీద నిలబడలేదని వ్యాఖ్యానించారు. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలంటూ విద్యార్థులు కేసీఆర్ కు లేఖలు రాయాలని పిలుపునిచ్చారు.
ఇన్ని మాటలు చెబుతున్న బండారు దత్తాత్రేయ.. తనకెంతో సన్నిహితుడైన కేసీఆర్ ను ముఖం మీదనే.. ‘‘ఏం పెద్ద మనిషి.. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి గతంలో అన్ని మాటలు చెప్పావే? ఇప్పుడా మాటలన్నీ ఎక్కడికి పోయాయి?’’ అని అడిగేయొచ్చుగా. అది వదిలేసి.. సీఎంకు ఉత్తరాలు రాయాలని.. ముఖ్యమంత్రిని ప్రశ్నించాలని మాత్రం చెప్పటం కనిపిస్తుంది. తనకెంతో సన్నిహితుడైన కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించలేని దత్తాత్రేయ ప్రజలకు మాత్రం పిలుపునివ్వటంలో అర్థమేంది..?దీన్నే అసలుసిసలు రాజకీయం అనుకోవాలా..?