ఏపీ నుంచి త్వరలో నాలుగు రాజ్య సభ సీట్లకు ఎన్నిక నిర్వహించాల్సిన సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నిన్న ఢిల్లీలో చేసిన వ్యాఖ్య రాజకీయ సంచలనంగా మారింది. ఇప్పటివరకు టీడీపీ - బీజేపీల్లో ఒక లెక్క చాలాసాధారణంగా వినిపించింది. నాలుగు రాజ్యసభ సీట్లలో ప్రస్తుత బలం ప్రకారం మూడు వస్తాయని.. వైసీపీ ఎమ్మెల్యేలను ఇంకా చేర్చుకుంటే మొత్తం నాలుగు సీట్లు టీడీపీకే దక్కుతాయని.. ఆ ప్రకారంలో అందులో బీజేపీకి ఇస్తారని మిగతా రెండు మాత్రమే టీడీపీ నేతలకు అవకాశముంటుందని అంతా అనుకున్నారు. వెంకయ్యనాయుడు - నిర్మలా సీతారామన్ లకు రెండు రాజ్యసభ సీట్లు టీడీపీ కోటాలో ఉంటాయని అంతా అనుకున్నారు. అయితే.. నిన్న ప్రధాని మోడీతో మీటింగుకు వెళ్లిన చంద్రబాబు ఆ తరువాత ఏపీ భవన్ లో మాట్లాడుతూ బీజేపీకి ఏపీ నుంచి రాజ్యసభ సీట్లిచ్చే ఆలోచనేమీ ప్రస్తుతానికి లేదని చెప్పారు. రెండు పార్టీల మధ్య విభేదాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
మరోవైపు బీజేపీ నేతల ప్రకటనలు, తీరు కూడా చంద్రబాబు మాటల వెనుక ఏదో ఉందన్న అనుమానాలను కలిగిస్తున్నాయి. వెంకయ్యనాయుడు కూడా ఏపీ నుంచి కాకుండా కర్ణాటక నుంచి తాను రాజ్యసభకు వెళ్తానని ఇటీవల సంకేతాలిచ్చారు. నిన్న ఏపీ భవన్ కు వచ్చిన చంద్రబాబును కలిసేందుకు నిర్మలా సీతారామన్ వచ్చారు. దీంతో ఏపీ నుంచి రాజ్యసభ సీటు విషయంలో మాట్లాడేందుకే ఆమె వచ్చారని భావిస్తున్నారు. రెండు పార్టీల మధ్య విభేదాలు పెరిగిన నేపథ్యంలో చంద్రబాబు బీజేపీకి రాజ్యసభ సీటిచ్చే విషయంలో కాస్త బెట్టు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాగా చంద్రబాబును నిర్మలా సీతారామన్ కలిసిన అనంతరం తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా వచ్చారు. దీంతో కొత్త అంచనాలు మొదలయ్యాయి. చంద్రబాబుతో సంప్రదింపులకే ఆయన వచ్చారని.. ఎలాగైనా టీడీపీ కోటాలో ఒక సీటు బీజేపీకి ఇప్పించేలా దత్తాత్రేయ రాయబారానికి వచ్చారని అనుకుంటున్నారు. అయితే.. అది నిర్మలా సీతారామన్ కోసమా లేదంటే తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు ఎవరికోసమైనా అన్నది తెలియలేదు. మొత్తానికి బీజీపీకి రాజ్య సభ సీటు కేటాయించే అంశం ఆలోచనలో లేదని చంద్రబాబు చెప్పడంతో బీజేపీలో ఒక్కసారిగా చర్చ మొదలైందని తెలుస్తోంది.