ఇప్పటి నేతల మాదిరి పరుషంగా మాట్లాడటం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు చేతకాదనే చెప్పాలి. కానీ.. ఆయన చెప్పే మాటల్లో సబ్జెక్ట్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆకట్టుకునేలా మాట్లాడటంలో దత్తన్న కాస్త వెనకబడినా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెప్పటమే కాదు.. తాను చెప్పే ప్రతి మాటకు లాజిక్ మిస్ కాకుండా చూసుకునే నేర్పు ఆయన సొంతం. అంతేకాదు.. తాను టార్గెట్ చేసిన వారిని వేలెత్తి చూపించే విషయంలోనూ దత్తాత్రేయ చాలానే జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది.
వారిపై విరుచుకుపడే క్రమంలో.. వారు మాట్లాడిన విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి..ఏ పాయింట్ మిస్ కాకుండా చూసుకునే తీరు కనిపిస్తుంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో రియాక్ట్ అయిన దత్తాత్రేయ మాటల్ని వింటే.. జైపాల్ రెడ్డికి చరిత్ర మీద అవగాహన తగ్గిందా? లేక.. చరిత్రను తప్పుదారి పట్టిస్తున్నారా? అన్న భావన కలగటం ఖాయం.
నెహ్రు.. సర్దార్ పటేల్ ఇద్దరూ కాంగ్రెస్ కు రెండు కళ్లు లాంటి వారని చెప్పటం.. బీజేపీ చీఫ్ అమిత్ షాను గల్లీ నేతగా అభివర్ణించటం లాంటి విమర్శలతో పాటు ఆర్ఎస్ ఎస్ పై జైపాల్ విమర్శల్ని తీవ్రస్థాయిలో తప్పు పట్టిన దత్తన్న.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత తప్పన్న విషయాన్ని ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన విషయాల్ని చూస్తే..
= తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్ రెడ్డి లాంటి నేత హైదరాబాద్ విముక్తిలో పటేల్ సేవల్ని తక్కువ చేసి మాట్లాడటం క్షమించరాని నేరం. హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్యను నెహ్రు రెండుసార్లు వాయిదా వేశారని.. ఇది గమనించిన పటేల్.. సంస్థానం చుట్టూ ముందుగానే ఆర్మీని మోహరించి సెప్టెంబరు 17న అత్యంత చాకచక్యంగా దాడి చేసి నిజాంను లొంగదీశారు.
= ఇప్పుడున్నకాంగ్రెస్ నకిలీ పార్టీ. జాతీయత.. దేశ ఐక్యతే బీజేపీకి ప్రధానం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ 1999 నుంచి పోరాడుతుంది. జైపాల్ రెడ్డి ఒక్క రోజు కూడా ఈ విషయం మీద మాట్లాడలేదు. హైదరాబాద్ పై పోలీసు చర్య నెహ్రు.. పటేల్ ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం అన్న జైపాల్ మాటలుపూర్తిగా తప్పు. పటేల్ కుంటే హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యేది కాదని 1947 నాటి ఐఏఎస్ అధికారి ఎంకేకే నాయర్ రాసిన పుస్తకంలోని విషయాల్ని మర్చిపోకూడదు (ఈ సందర్భంగా ఆ పుస్తకాన్ని విలేకరులకు చూపించటం గమనార్హం)
= నెహ్రు.. పటేల్ లను కాంగ్రెస్ కు రెండు కళ్లుగా జైపాల్ చెప్పిందే నిజమైతే.. పటేల్ జన్మదినాన్ని దేశ ఐక్యతా దినంగా ఎందుకు నిర్వహించలేదు? నెహ్రు తప్పిదం కారణంగానే కశ్మీర్ రావణ కాష్టంగా రగులుతోంది. 1948లో మన సైన్యం కశ్మీర్ ను పూర్తిగా స్వాధీనం చేసుకునే సమయంలో నెహ్రు సమస్యను ఐక్యరాజ్య సమితికి విన్నవించి.. సమస్య కాని సమస్యను సమస్యగా మార్చారు నెహ్రు. గాంధీ.. నెహ్రు కుటుంబాలకు కాంగ్రెస్ దాసోహమైంది. ఒక్క ఎయిర్ పోర్ట్ కన్నా గాంధీ.. నెహ్రు పేర్లు కాకుండా మిగిలిన నేతల పేర్లు పెట్టారా..?
= నెహ్రు సోషలిజానికి వ్యతిరేకంగా ఆర్థిక సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ ప్రధాని పీవీనే. అమిత్ షా తన స్వయం కృషితో గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగారు. కానీ.. జైపాల్ రెడ్డే ఢిల్లీ స్థాయి వ్యక్తి కాస్తా గల్లీ లీడర్ గా మారారు. ఆర్ ఎస్ ఎస్ బ్రిటీష్ వారికి తొత్తు అన్న జైపాల్ వ్యాఖ్యలు నిజం కావు. ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపకులు హెగ్గేవార్ ఎన్నోసార్లు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించి జైలు పాలయ్యారు. జైపాల్ రెడ్డి చరిత్రను తెలుసుకొని మాట్లాడితే మంచిది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/