తెలంగాణలో బలపడాలని లక్ష్యం నిర్దేశించుకున్న బీజేపీ నేతలు ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్ ను మొదటి ప్రాధామ్యంగా ఎంచుకున్నారు. సొంత జిల్లాలోనే ఆయనకు సెగ తగిలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. మీడియాతో దత్తాత్రేయ మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి సీఎం కేసీఆర్ సొంత జిల్లా నుంచే కృషి చేస్తామని స్పష్టం చేశారు.తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పారు. ఇందుకోసం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.
టీఆర్ ఎస్ ఎన్నికల హామీలను విస్మరించిందని, మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటడం లేదని దత్తాత్రేయ ఆరోపించారు. విమర్శించే వారిపై ఎదురు దాడి చేయడం సరికాదని, ప్రతిపక్షాలను అణిచేయడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో కమలం గాలి వీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర పథకాలు అందరూ వినియోగించుకునేలా చూడాలని పార్టీ నేతలను దత్తాత్రేయ కోరారు. తాయిలాలు ఇచ్చే పార్టీలు శాశ్వతం కాదనే విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/