పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన ఓ ప్రతిపాదన టీ కప్పులో తుఫానులా చల్లారిపోయింది. ప్రభుత్వం తీవ్రంగా ఇరుకునపడుతుందని భావిస్తున్న అంచనాలను పూర్తిగా తొలగించేలా ఆ రచ్చకు ఫుల్ స్టాప్ పడింది. ఇటీవల ఉత్తర కర్ణాటక డిమాండ్ జోరుగా తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. 13 జిల్లాలతో ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రం కోసం ఉత్తర కర్ణాటక రైతు సంఘ బంద్ పిలుపు ఇచ్చింది. అయితే, జనం బంద్ ను పట్టించుకోలేదు. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిర్వహించిన బంద్ అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు బంద్ కు ప్రజలు స్పందించలేదు. బంద్ కు పిలుపునిచ్చిన వివిధ సంఘాల నేతలు - కార్యకర్తలు ఉదయం కొద్దిగా హడావుడి చేసినా తర్వాత వారు కూడా సైలెంట్ అయ్యారు.
వాస్తవానికి ఈ బంద్ విషయంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర కోసం నినదిస్తున్న ఉత్తర కర్ణాటక రాజ్య పోరాట సమితి బంద్ పిలుపు ఇచ్చి అనంతరం విత్ డ్రా చేసుకుంది. తమ ప్రధాన డిమాండ్లను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కుమారస్వామి నిన్న హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కర్ణాటక రైత సంఘ మాత్రం బంద్ ను కొనసాగించింది. తమకు 23 సంఘాల సపోర్ట్ ఉందని రైత సంఘ ప్రకటించుకుంది. అయితే, గ్రౌండ్ లెవెల్లో అదెక్కడా కనిపించలేదు. ట్రేడ్ యూనియన్లు - అనేక కన్నడ సంస్థలు బంద్ కు మద్దతు ప్రకటించినా… వ్యాపారులు - ప్రజలు లైట్ తీసుకున్నారు. ఉదయం నుంచే దుకాణాలు తెరుచుకోవడం - ప్రజాజీవితం సాఫీగానే సాగింది. ఉదయం కర్ణాటక రైత సంఘ కార్యకర్తలు బస్ డిపోలు దగ్గర బైఠాయించారు. కొద్దిసేపు దుకాణాలు మూయించారు. కొందరు కార్యకర్తలు వివిధ పట్టణాల్లో ర్యాలీలు తీశారు. ఆందోళన ప్రదర్శనలు కూడా సింబాలిక్ గా జరిగాయి.
బంద్ ను సమర్థవంతంగా JDS-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అదుపు చేసింది. బంద్ కు స్పందన లేకపోవడం తన విధానాలు కరెక్ట్ అని నిరూపించిందని సీఎం కుమారస్వామి అన్నారు. వచ్చే రెండు నెలల్లో ఆ 13జిల్లాల్లో పర్యటించనున్నట్టు కుమారస్వామి తెలిపారు. బీజేపీనే వెనకుండి బంద్ చేయిస్తోందని జేడీఎస్ - కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండిస్తున్న బీజేపీ నేతలు కర్ణాటక విభజనకు తాము వ్యతిరేకమంటున్నారు. రాష్ట్ర విభజన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని నేతలను యడ్యూరప్ప హెచ్చరించారు. కాగా, తాజా పరిణామం సర్కారుకు పెద్ద ఉపశమనం అని భావిస్తున్నారు.