తెలంగాణలో బీజేపీకి ఊపిరిలూదేందుకు ఫైర్ బ్రాండ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది అధిష్టానం. యువకుడైన బండికి అవకాశం దక్కడంతో యువత భారీగా ఆశలు పెంచుకుంది. ఈ క్రమంలోనే సీనియర్లందరినీ పక్కనపెట్టి బండి సంజయ్ తన కొత్త టీంను ప్రకటించారు.
తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కు తగ్గట్టే దూకుడు.. విరుచుకుపడే వారితోనే బండి సంజయ్ కొత్త టీంను రెడీ చేశాడు.తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో మాజీ అధ్యక్షుడు లక్ష్మన్ సహా డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్ లాంటి ప్రముఖులకు మొండి చేయి చూపడం చర్చనీయాంశమైంది. కార్యవర్గ సభ్యులు, పదాధికారులను ఎన్నుకున్న విధానాన్ని చూస్తే పార్టీ బలంగా ఉన్న జిల్లాలపై బండి ఎక్కువగా దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది.
మొత్తం 22 మందితో తన టీంను బండి సంజయ్ ప్రకటించారు. ఇందులో 8మంది ఉపాధ్యక్షులు.. నలుగురు పార్టీ ప్రధాన కార్యదర్శులు.. 8మంది కార్యదర్శులుగా నియమించారు.
*ఉపాధ్యక్షులు
విజయరామారావు, చింతల రాంచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, యెండల లక్ష్మీనారాయణ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ రెడ్డి, బండారు శోభారాణి,
* ప్రధాన కార్యదర్శులు
ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బండారు శృతి, మంత్రి శ్రీనివాసులు
*కార్యదర్శులు
రఘునందన్ రావు, ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణి
ఇలా అంతా ఫైర్ బ్రాండ్స్, యువత, మహిళలకు పెద్ద పీట వేసి కేసీఆర్ సర్కార్ ను ఢీకొట్టే బ్యాచ్ ను రంగంలోకి దింపారు బండి సంజయ్. మరి ఇది ఏ మేరకు సఫలీకృతం అవుతుందనేది వేచిచూద్దాం.