కొడుకు మీద కేసు పెట్టించారంటూ బండి ఆగ్రహం.. హిమాన్షు మీద తీవ్ర వ్యాఖ్యలు

Update: 2023-01-18 04:39 GMT
దాదాపు మూడు వారాల క్రితం జరిగిన ఒక ఉదంతం బయటకు రావటం తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ.. హైదరాబాద్ మహానగర శివారులో ఉండే.. మహేంద్ర ఎకోలీ వర్సిటీలో చదువుతున్నాడు.

తన స్నేహితుడి సోదరితో ఒక విద్యార్థి తెల్లవారుజామున ఫోన్ చేసి మాట్లాడటం.. లవ్ చేయాలని ఒత్తిడి చేయటంలాంటి పరిణామాలపై తీవ్రంగా స్పందించి.. అతడ్ని కొట్టటం. .దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావటం తెలిసిందే. ఈ వీడియోలలో బండి భగీరధ చేయి చేసుకున్న విద్యార్థి తనను ఎందుకు కొట్టారన్న విషయాన్ని చెబుతూ.. తాను ఒక అమ్మాయిని వేధింపులకు గురి చేసినట్లుగా ఒప్పుకున్నాడు.

అయినప్పటికీ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కావటం తెలిసిందే. తన కొడుకుపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసిన వేళ.. దేశ రాజధాని ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన వేళ.. తనకొడుకు మీద కేసు పెట్టటాన్ని.. స్టేషన్ కు తీసుకెళ్లి కొట్టిన వైనంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మనిషే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలు కొట్టుకుంటారని.. తర్వాత కలిసిపోతారని.. కావాలని రాజకీయ కక్షతో కేసులు పెట్టించి.. వారి బంగారు భవిష్యత్తును ధ్వంసం చేస్తారా? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మనమడు కమ్ మంత్రి కేటీఆర్ కుమారుడు అయిన హిమాన్షు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడనంటూనే అన్ని విషయాల్నిప్రస్తావించిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఇప్పటివరకు కేసీఆర్ మనమడి మీద ఒక్కటంటే ఒక్కటి కూడా నెగిటివ్ పాయింట్లే లేని వేళ.. అందుకు భిన్నంగా నీ మనమడు ఇన్ని చేశాడు మరి.. అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. అవేమంటే..
-  అనాడు ఇంటర్ పిల్లల్నిచంపినావ్. ఆ పాపం ఊరికే పోలేదు. అందుకే డౌన్ పాల్ స్టార్ట్ అయ్యింది. నా కొడుకు క్యూమార్ట్ బార్ కు పోయి గొడవ చేయలేదు.
-  మందు కోసం లొల్లి పెట్టలేదు.
-  ఎల్సీయస్ కు వెళ్లి అందరినీ బెదింపులకు గురి చేసి తెల్లవార్ల వరకు డ్యాన్సులు చేయించలేదు.
-  అధికారం లేకున్నా భద్రాద్రిలో తలంబాలు మోయలేదు.
-  అమ్మాయిలతో స్కూళ్లలో డ్యాన్సులు వేయించలేదు.
-  నేను తీయదల్చుకుంటే నీ మనమడు చేసిన వాటిని బయటపెట్టటానికి గంట కూడా పట్టదు.
-  నువ్వు చేసేది కరెక్టో కాదో నీ భార్యను.. కోడలిని అడిగి తెలుసుకో.
-  నా కొడుకు తప్పు చేస్తే నేనే పోలీసులకు సరెండర్ చేస్తా.
-  కేసీఆర్.. నా కొడుకుపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తావా? లాఠీలతో కొట్టిస్తావా? చూద్దాం.
-  రాష్ట్రంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు.. వేధింపులను ఆపటం చేతకాదు. కానీ చిన్న పిల్లలపై కేసు నమోదు చేసి.. వారి జీవితాల్నినాశనం చేస్తావా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News