కేసీఆర్‌ను ఇందిరా‌గాంధీతో పోల్చిన బీజేపీ రాష్ట్ర నాయ‌కుడు

Update: 2020-06-26 17:00 GMT
దేశంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి విధించి నియంత పాల‌న చేసిన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మాదిరి తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ఇందిరాగాంధీ బాటలో నడుస్తూ కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. 1975లో ఇందిరాగాంధీ చేసిన‌ట్టు అవినీతి, ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకులు, ప్రజాసంఘాల కార్యకర్తలు, కళాకారులపై అక్రమ కేసులు పెట్టించి జైళ్లకు కేసీఆర్ పంపుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మావేశంలో బండి సంజ‌య్‌కుమార్ టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఇటీవ‌ల త‌మ పార్టీ అధ్య‌క్షుడు న‌డ్డాపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో వాటిపై కూడా సంజ‌య్ స్పందించి వారికి కౌంట‌ర్ ఇచ్చారు. ఎమర్జెన్సీ చివరలో ఇందిర పాలనకు ఏ గతి పట్టిందో టీఆర్‌ఎస్‌ పాలనకూ అదే గతి పట్టనుందని జోష్యం చెప్పారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మలిదశ తెలంగాణ ఉద్యమానికి కదలి రావాలని, టీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పాలని ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. కుటుంబ పాలన అనే అంటురోగాన్ని అంటగట్టిన పాపం కాంగ్రెస్‌దేనని తెలిపారు. కాంగ్రెస్‌ను చూసి దేశంలో మరికొన్ని పార్టీలు కుటుంబ పాలనే లక్ష్యంగా ఏర్పడ్డాయని వివ‌రించారు.
Tags:    

Similar News