బీజేపీ 'బండి' వెనుక‌.. 'బండ్లు' ఎక్క‌డ‌?

Update: 2022-04-04 16:30 GMT
`బండెన‌క బండి క‌ట్టి.. ప‌ద‌హారు బండ్లు క‌ట్టి.. ` అనే పాట తెల‌గాణ మాగాణంలో ప్ర‌తి గ‌డ‌ప‌లోనూ వినిపించిన విష‌యం తెలిసిందే. ఒక్క‌రు ప‌దం క‌ట్టి క‌దం తొక్కితే.. వారిని అనుస‌రించి ఊళ్ల‌కు ఊళ్లు ముందుకు క‌దిలిన సంద‌ర్భం.. నైజాం నిరంకుశ పాల‌న‌పై విప్ల‌వం సాగించిన సంద‌ర్భం.. ఇంకా తెలంగాణ ప్ర‌జ‌ల క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది.

అయితే.. మ‌ళ్లీ ఈ త‌ర‌హా ఉద్య‌మాన్ని తీసుకువ‌స్తామ‌ని.. నియంత‌గా ప్ర‌జ‌ల‌ను పీక్కుతింటున్న కేసీఆర్ కుటుంబ పాల‌న‌పై స‌మ‌ర శంఖం పూరిస్తామ‌ని.. త‌ర‌చుగా చెబుతున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి..సంజ‌య్ రాను రాను.. త‌న ప్ర‌భ కోల్పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి బండి సంజ‌య్ రాష్ట్ర క‌మ‌లం పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. మంచి ఊపు వ‌చ్చిన విష‌యం తెలిసిందేన‌ని ప‌రిశీ ల‌కులు చెబుతుంటారు. అప్ప‌ట్లో జీహెచ్ ఎంసీ ఎన్నిక‌లు కానీ.. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక కానీ.. బీజేపీకి మంచి ఊపు తెచ్చింది. బండి సంజ‌య్‌.. మీటింగుల‌కు జ‌నాలు పోటెత్తారు. అదేవిధంగా నాయ‌కులు కూడా ఎగ‌బ‌డి చూశారు.

ఇక‌, మీడియా కూడా తీవ్ర‌స్థాయిలో ఆయ‌న‌ను ఫోక‌స్ చేసింది. ఆ స‌మ‌యంలో చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు కూడా చ‌ర్్చ‌కు వ‌చ్చాయి. బీజేపీకి ఇండైరెక్ట్‌గా.. టీఆర్ ఎస్ పార్టీ మ‌ద్ద‌తిచ్చింద‌నే వాద‌న ఉంది. కాంగ్రెస్ ఎక్క‌డ బ‌ల‌ప‌డుతుందో.. త‌మ పుట్టిని ఎక్క‌డ ముంచుతుందో.. అని భావించిన టీఆర్ ఎస్‌.. బీజేపీకి మ‌ద్ద‌తు తెలిపింది.

దీంతో బీజేపీ కొంత మేర‌కు పుంజుకుంది. అయితే.. ఇదంతా కూడా బండి త‌న ఖాతాలోనే వేసుకున్నారు. ఇంకేముంది.. నావ‌ల్లే బీజేపీ పుంజుకుంద‌ని.. ఆయ‌న వ‌ర్గం ప్ర‌చారం చేప‌ట్టింది. అంతేకాదు.. రాబోయే ఎన్నిక‌ల్లో.. బీజీకి క‌నీసం.. 30 స్థానాల్లో పాగా వేయ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి.

దీంతో బండి ప్ర‌భ  ఓ రేంజ్‌లో వెలిగిపోయింది. ఈ ఊపులోనే.. కేసీఆర్ కేంద్రంగా విరుచుకుప‌డ్డారు. కుటుంబ పాల‌న అంటూ.. ప్ర‌చారం చేశారు. ఇంకేముంది. .రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేస్తాం.. అంటూ.. పాద‌యాత్ర‌లు చేప‌ట్టారు. అయితే.. ఈ పాద‌యాత్ర మూణ్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోయింది. ఊపులేక బ్రేక్ ఇచ్చారు. మ‌ళ్లీ ప్రారంభించారు. అయినా.. ఎక్క‌డా ఊపు లేక పోవ‌డంతో పాద‌యాత్ర ఊసు ఎత్త‌డం మానేశారు.

ఇక‌, గ‌త ఆరు మాసాల నుంచి కూడా బండి ఆధ్వ‌ర్యంలో వాయిస్ వినిపిస్తోందే త‌ప్ప‌.. ``విష‌యం`` క‌నిపించ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే.. నిజానికి పార్టీకి అధికారంలోకి వ‌చ్చేసే సీన్ కానీ.. క‌నీసం 30 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకునే స్థాయికానీ ఉండి ఉంటే.. ఇప్ప‌టికే.. పొరుగు పార్టీల నుంచి ముఖ్యంగా అధికార పార్టీ నుంచి కూడా వ‌ల‌స‌లు జోరందుకునేవి.

ఎందుకంటే.. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఎవ‌రికి వారు వ‌చ్చేసి.. ఆయా సీట్ల‌లో క‌ర్చీఫ్‌లు వేసుకునేవారు. కానీ, బండి వారి ప‌రిస్థితి త‌ద్భిన్నంగా ఉంది. ఒక్క‌రంటే.. ఒక్క నేత రాలేదు. పోనీ.. అధికారంలో ఉన్న వారు రాలేదు.. అంటే.. ఓకే అనుకోవ‌చ్చు.. మాజీ ల‌కు ఏమైంది.. వారు కూడా రాలేదుగా!

సో.. దీనిని బ‌ట్టి.. బండి ప‌రిస్థితి `పైన ప‌టారం..` అనే చందంగా మారిపోయింద‌ని.. రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే విష‌యంపై ఇత‌ర పార్టీల నేత‌లు కూడా చ‌ర్చించుకుంటున్నారు. బండి వ్యాఖ్య‌ల‌కు సొంత పార్టీ నేత‌లే.. మ‌ద్ద‌తు తెల‌ప‌డంలేద‌ని.. ఇటీవ‌ల ఓ ప‌త్రిక క‌థ‌నం రాసుకువ‌చ్చింది.

అది క‌నుక త‌ప్ప‌యితే.. దీనిని ఖండించాల్సిన ప‌రిస్థితి ఉంది. కానీ.. బీజేపీలో ఒక్క‌రంటే.. ఒక్క‌రూ ఖండించ‌లేదు. సో.. ఏతా వాతా ఎలా చూసుకున్న బండి డ‌ల్ అయ్యార‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే.. ``బండెన‌క బండి`` క‌ట్టి.. బండి వెనుక .. న‌డిచేందుకు.. ఎవ‌రు ముందుకు రావ‌డం లేద‌ని చెబుతున్నారు. మ‌రి ఇప్పుడే.. ఈ ప‌రిస్థితి ఉంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఏంటి? అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News