బండి యాత్ర‌లో ఉద్రిక్త‌త‌.. అడ్డుకున్న టీఆర్ ఎస్ నేత‌లు

Update: 2022-04-19 00:45 GMT
తెలంగాణ బీజేపీ చీఫ్‌.. ఫైర్ బ్రాండ్ బండి సంజ‌య్ ప్రారంభించిన ప్ర‌జా సంగ్రామ యాత్రలో ఈ రోజు తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఐదో రోజు పాద్ర‌యాత్ర ఎప్ప‌టిలాగే కొనసాగుతోంది. బండి సంజయ్ ఇటిక్యాల మండలం వేములలో ప్రసంగించిన అనంతరం పాదయాత్ర కొనసాగుతుండగా కొంతమంది మంది టీఆర్ ఎస్‌ కార్యకర్తలు పాదయాత్రకు అడ్డు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి టీఆఎస్ ఎస్‌ కార్యకర్తలను చెదరగొట్టారు. వారిని వేరే ప్రదేశానికి తరలించారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటీఆర్ ఎస్‌ కార్యకర్తల వైపు బీజేపీ శ్రేణులు దూసుకెళ్లాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అప్ర మత్తమైన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కలగజేసుకొని పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పడంతో పాదయాత్ర తిరిగి కొనసాగింది.

ఉద్రిక్తతకు ముందుగా వేములలో ప్రసంగించిన బండి సంజయ్.. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనపై ధ్వజమెత్తా రు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ ఇంతవరకూ నెరవేర్చలేకపోయారని ధ్వజమెత్తారు. నీళ్లు, నియామకాల విషయంలో కేసీఆర్ మాట తప్పారన్న బండి సంజయ్... కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. నేడు వేముల నుంచి బట్ల దిన్నె, షాబాద్ మీదుగా ఉదండపూర్ వరకు పాదయాత్ర సాగనుంది.

'కేసీఆర్ ఎన్నికల్లో గెలిస్తే గద్వాల జిల్లాకు నీళ్లిస్తామన్నారు. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. అన్నీ హామీలే కానీ అమలులో మాత్రం శూన్యం. లీటర్ పెట్రోల్కు రూ.30 కమిషన్ తీసుకుంటూ కేంద్రాన్ని బదనాం చేస్తున్నారు. ప్రజలంతా ఈ మోసాన్ని గమనించాలి`` అని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.
Tags:    

Similar News