తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ఎక్కడికెళ్లినా అబద్ధాలు చెప్పడం అలవాటైపోయిందని అన్నారు. సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించి అక్కడ నిధులు ఇస్తానని హామీ ఇచ్చిన మాటలపై బండి సంజయ్ స్పందించారు. ఏయే పంచాయతీలకు నిధులు ఇచ్చారో సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ దేశాన్ని ఏం చేయాలని నిర్ణయించుకున్నారని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే ఏం చేయని ముఖ్యమంత్రి దేశాన్ని ఏం చేస్తారని నిలదీశారు. తెలంగాణ శివాజీ మహరాజ్ వేడుకలు జరుపుకోవడానికి అనుమతి ఇవ్వని ముఖ్యమంత్రి... శివాజీ వారుసలమని చెప్పుకునే శివసేనతో ఎలా సమావేశం ఏర్పాటు చేసుకున్నారని అడిగారు.
రాష్ట్రంలో కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారన్నారు. కుటుంబ అవినీతిలో కల్వకుంట్ల కుటుంబమే నంబర్‌వన్ అని ఆయన ఆరోపించారు. సీఎంలోని దేశ వ్యతిరేక భావజాలాన్ని యువత గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
``బంగారు భారత్ అంట. ఇక్కడ బంగారు తెలంగాణ చేసిండు. ఇగ అక్కడ పోతడంట. ఏం చేసిండు బంగారు తెలంగాణల... రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఉద్యోగులు, కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. బంగారు తెలంగాణ కాదు. ఆత్మహత్యల తెలంగాణ తయారు చేసినవ్. ఇప్పుడు బంగారు భారత్ చేస్తా అంటున్నడు. దేశాన్ని ఏలాలని కలలు కంటున్నడు. అవి కలలుగానే మిగిలిపోతాయి. నువ్వు నీ కుటుంబం చేసిందేమి లేదు. అడ్డగోలుగా దోచుకున్నరు.`` అని బండి నిప్పులు చెరిగారు.