ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ జమానా. ఎవరో ఏదో చెప్పారని.. దాన్ని అదే పనిగా తిరిగి చెప్పటం ఉండదు. కాస్త బుర్ర వాడేసి.. అవతలోడు చెప్పేది నిజమా? అబద్ధమా? అని క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితి. గతంలో అయితే గూగులమ్మ ఉండేది కాదు. కానీ.. ఇప్పుడు అందరికి సమాచార భాండాగారంగా గూగులమ్మ చెంత ఉన్నప్పుడు.. సందేహం ఏం వచ్చినా.. దాన్ని టైప్ చేసేయటం.. లేదంటే వాయిస్ సెర్చ్ చేసినా.. సమాధానాలు ఇట్టే వచ్చేస్తున్నాయి.
తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉండటం తెలిసిందే. ఉద్యోగుల బదిలీలకు వ్యతిరేకంగా గళం విప్పిన బండి సంజయ్.. సరిగ్గా వారం క్రితం ఆదివారం రాత్రి వేళ అరెస్టు కావటం.. అనంతరం జైలు పాలుకావటం తెలిసిందే. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు.. హైకోర్టు ఆదేశాలు వెరసి.. ఆయన బయటకు వచ్చారు. బండి బయటకు రావటానికి ముందు నుంచే.. ఆయన్ను అరెస్టు చేసిన కేసీఆర్ సర్కారుపై కమలనాథులు తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని సీఎం కేసీఆర్ అరెస్టు చేయించారని.. అంతకంతకూ బదులు తీర్చుకుంటామంటూ వారు మండి పడటం తెలిసిందే.
జైలు నుంచి బయటకు వచ్చిన బండి సంజయ్.. మరింత చెలరేగిపోతున్నారు. సీఎం కేసీఆర్ పై మరింత ఘాటుగా రియాక్టు అవుతున్నారు. తాజాగా ఆయన హన్మకొండలో జరిగిన సభకు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని మరో కథనంలో మాట్లాడుకుందాం. ఇక్కడ మాత్రం.. ఆయన చేసిన వ్యాఖ్యల్లో అందరిని ఆకర్షించి.. బండి చెప్పింది నిజమేనా? ఒకసారి చెక్ చేసుకుందామనిపించేలా ఆయన ఒక మాట చెప్పారు.
గూగుల్ లో ‘వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా’ అని టైప్ చేస్తే.. సీఎం కేసీఆర్ పేరు వస్తుందని చెప్పారు. బండి సంజయ్ చెప్పినట్లే.. గూగులమ్మలో వెతికితే.. అందుకు భిన్నమైన ఫలితం రావటం గమనార్హం. దాదాపు ఏడాది క్రితం.. అప్పట్లో గూగులమ్మను ‘వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా’ అని వాయిస్ సెర్చ్ లో ప్రశ్నిస్తే.. కేసీఆర్ పేరుతో సమాధానం వచ్చిన ఒక వీడియో ఒకటి ఉంది. అంతే తప్పించి.. గూగుల్ మాత్రం ఇప్పుడు అలాంటి సమాధానం చెప్పటం లేదు. అంటే.. ఏడాది క్రితం వచ్చిన దాని గురించి.. ఇప్పుడు చెప్పటం ఏమిటి బండి సంజయ్? అని ప్రశ్నిస్తున్నారు.
డిజిటల్ ప్రపంచంలో రాజకీయ ఆరోపణలు చేసే ముందు.. కాస్తంత క్రాస్ చెక్ చేసుకోవాలంటున్నారు. లేదంటే.. బండి మాటల్ని పిచ్చ లైట్ తీసుకోవటం ఖాయమంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించటం లాంటి పెద్ద టాస్కులు పెట్టుకున్నప్పుడు.. ప్రాథమిక అంశాల మీద అవగాహన లేకపోతే ఎలా బండి సాబ్? నోటికి వచ్చిన మాటల్ని చెప్పేసి.. అడ్డంగా బుక్ అయితే.. ఎంత అభాసుపాలు? ఇప్పటికైనా మించిపోయింది లేదు.. గూగులమ్మ లాంటి పేర్లను కోట్ చేసే వేళలో.. కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం చాలా అవసరం. ఈ విషయాల్ని బండి సాబ్ కు ఎవరో ఒకరు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది.