పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దేవుడిగా భావించే కొలిచే అపర భక్తుల్లో నటుడు/నిర్మాత బండ్ల గణేష్ ముందుంటాడు. టాలీవుడ్ లో పవన్ అంటే ఇష్టపడేవాళ్లలో బండ్ల గణేష్ అత్యంత ముఖ్యుడు. హార్డ్ కోర్ ఫ్యాన్ గా ఉంటాడు.
పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు.. ఆ సినీ వేడుకలో బండ్ల గణేష్ స్పీచ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తారు. రాజకీయాల్లో చేరి చేతులు కాల్చుకున్న బండ్ల గణేష్ అనంతరం వాటికి దూరంగా జరిగారు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు. రాజకీయాల్లోకి రాను అని ప్రకటించిన బండ్లగణేష్ తాజాగా పవన్ కళ్యాణ్ పార్టీలో చేరికపై ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలను, అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళుతున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారమే లక్ష్యంగా సాగుతున్నారు. ఇటీవల 9వ జనసేన ఆవిర్భావ సభను కూడా నిర్వహించి రాజ్యాధికారం సాధిస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలోనే బండ్ల గణేష్ తాజాగా జనసేన పార్టీలో చేరికపై ఓ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో బండ్లగణేష్ ఇచ్చిన ఓ రిప్లై ఆసక్తిగా మారింది.
ఓ పవన్ కళ్యాణ్ అభిమాని తాజాగా 'పవన్ పార్టీ జనసేనలోకి చిరంజీవి వస్తే బాగుంటుంది' అని అభిప్రాయపడ్డారు. దీన్ని షేర్ చేసిన బండ్ల గణేష్ 'మరి నేను' అన్నట్టుగా దానికి రిప్లై ఇచ్చి ప్రశ్నించారు.
దీంతో బండ్ల గణేష్ గాలి మరోసారి రాజకీయాలకు మళ్లిందని.. తను దేవుడుగా కొలిచే పవన్ కళ్యాణ్ పార్టీలోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ ట్వీట్ తో బండ్ల గణేష్ జనసేనలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. మరి దీనికి పవన్ ఏం సమాధానమిస్తారు? తన శిష్యుడిని పార్టీలో చేర్చుకుంటారా? లేదా? అన్నది చూడాలి.