మంత్రి రోజాపై కీలక వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్

Update: 2022-05-02 04:28 GMT
సినీ నటి నుంచి ఎమ్మెల్యేగా.. ఇప్పుడు వైసీపీ రాష్ట్ర మంత్రి రోజా అంటే అందరికీ అభిమానమే. ముఖ్యంగా ఆమె సినిమాలు, సీరియళ్లు, పలు టీవీ షోలతో టాలీవుడ్ తో అనుబంధం పెంచుకున్నారు. టాలీవుడ్ లో ఒకరిగా కలిసిపోయారు. ఈ క్రమంలోనే ఒక నటి నుంచి వైసీపీ మంత్రిగా ఎదిగిన రోజాకు సన్మానం చేయాలని తాజాగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కోరారు. సినీ పెద్దలు దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలన్నరు.

ఆర్కే రోజాకు మంత్రి పదవి రావడంపై ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు మంత్రి పదవి రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. సినీ నటిగా ప్రయాణం ప్రారంభించి రాజకీయాల్లో పోరాడారని గుర్తు చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రెండు సార్లు ఓడిపోయి.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు మంత్రి పదవి రావడం శుభ పరిణామం అని బండ్ల గణేష్ కొనియాడారు. మంత్రి పదవి చేపట్టిన రోజాను తెలుగు సినీ పరిశ్రమ సన్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రోజాను సన్మానించే విషయమై సినీ పెద్దలు కూర్చొని త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

రోజాను మంత్రిగా చూడడం చాలా ఆనందంగా ఉందని.. ఆమెకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్ కు బండ్ల గణేష్ ధన్యవాదాలు తెలిపారు. ఇక తాను మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో లేనని బండ్ల గణేష్ తెలిపారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్న మాట వాస్తవమేనని.. కానీ ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని తేల్చిచెప్పారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. తనకు ప్రతీ పార్టీలో స్నేహితులు ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ లో రంజిత్ రెడ్డి తనకు మంచి స్నేహితులని బండ్ల అన్నారు. స్నేహాలకు, రాజకీయాలకు సంబంధం లేదని బండ్ల అన్నారు.

ఇక ఏపీలో పరిస్థితులపై కేటీఆర్ మాట్లాడితే వైసీపీ వాళ్లు ఎందుకు భుజాలు  తడుముకున్నారని బండ్ల ప్రశ్నించారు. ఇక హైదరాబాద్ లో కరెంట్ లేదని అన్న మంత్రి బొత్స సత్యనారాయణ గురించి తనను అడగవద్దని.. తాను పవన్, బొత్స కూడా ఎలాంటి కామెంట్ చేయనని బండ్ల గణేష్ తేల్చిచెప్పారు.

పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని ఉందని బండ్ల గణేష్ తన కోరికను వెలిబుచ్చారు. అదే తన చిరకాల వాంఛ అని బండ్ల అన్నారు.
Tags:    

Similar News