బెంగుళూరు లో బిబిఎ స్టూడెంట్ ..తమిళనాడులో సర్పంచ్!

Update: 2020-01-04 12:13 GMT
బెంగళూరు కాలేజ్ లో బీబీఎ విద్యాభ్యాసం చేస్తున్న 21 ఏళ్ల యువతి తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గ్రామ పంచాయితీ అధ్యక్షురాలిగా ఎన్నిక అయ్యింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని కాలేజ్ విద్యార్థిని ఎన్నికల్లో ప్రత్యర్థ పార్టీ నాయకులకు  చుక్కలు చూపించి విజయం సాధించింది. పూర్తి వివరాలు చూస్తే ...తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని కాటినాయకంతొట్టి గ్రామంలో జయసారథి అనే ఆయన నివాసం ఉంటున్నారు. జయసారథి గతసారి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడు అయ్యారు. జయసారథి కుమార్తె సంధ్యారాణి బెంగళూరు నగరంలోని క్రైస్ట్ కాలేజ్ లో ప్రస్తుతం బీబీఎ చివరి సంవత్సరం చదువుతుంది.

తమిళనాడులో డిసెంబర్ 27 - 30వ తేదీల్లో రెండు విడతలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. పంచాయితీ - గ్రామ పంచాయితీ - జిల్లా పంచాయితీ ఎన్నికల్లో 2.30 లక్షల మందికి పైగా పోటీ చేశారు. బెంగళూరు నగరం శివార్లలోని కర్ణాటక- తమిళనాడు సరిహద్దులోని క్రిష్ణగిరి జిల్లా లో కూడా  స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అయితే, కాటినాయకం తొట్టి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి మహిళలకు మాత్రమే అవకాశం ఉంది. ఆ పంచాయితీ మహిళలకి రిజర్వేషన్ ఇవ్వడంతో .. జయసారథి పోటీ చెయ్యడానికి అవకాశం లేకపోవడంతో తన కుటుంబంలో ఎవరినో ఒకరిని పోటీ చేయించాలని ఆయన నిర్ణయించారు. ఈ సమయంలోనే కాలేజ్ లో చురుగ్గా చదువుకుంటున్న మీ కుమార్తె సంధ్యారాణిని పోటీ చేయించాలని బంధువులు - స్నేహితులు - శ్రేయోభిలాషులు జయసారథికి సలహా ఇచ్చారు.

దీనితో ఆమెతో మాట్లాడి ..ఆమె ఇష్టం మేరకు పోటీలోదించారు. తండ్రి బలం  - యువ రక్తం కావడంతో అందరిని తన మాటలతో  బాగా ఆకట్టుకుంది. అలాగే గెలిస్తే ఏమి చేయాలనీ అనుకుంటుందో ..మొత్తం సవివరంగా చెప్పడంతో అందరూ ఆమె వైపున నిలిచారు. మొత్తంగా  కాటినాయకంతొట్టి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసిన సంధ్యారాణికి 1, 170 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి జై సాండియాకు 920 ఓట్లు రావడంతో 210 ఓట్ల భారీ మెజారిటీతో సంధ్యారాణి విజయం సాధించారు. సంధ్యారాణి విజయం సాధించడంతో స్థానిక యువత సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో బీబీఎ చివరి సంవత్సరం  చదువుతున్న ఈమె , కాలేజ్ ప్రిన్సిపల్ అనుమతి తీసుకుని ఎన్నికల్లో సంధ్యారాణి పోటీ చేసిందని, చివరి సంవత్సరం కావడంతో చదువు పూర్తి చేసిన తరువాత పూర్తిగా రాజకీయాల్లో ఉంటుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. 
Tags:    

Similar News