భారత్ తో సరిహద్దులను మూసివేసిన బంగ్లాదేశ్...ఎందుకంటే ?

Update: 2021-04-26 04:30 GMT
భారతదేశం లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ప్రతి రోజు కూడా లక్షల్లో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు భారత్ తో సంబంధాలు కొన్ని రోజుల వరకు తెంచుకుంటున్నాయి. తాజాగా భారత్ తో  సరిహద్దులను మూసివేస్తున్నామని బంగ్లాదేశ్ ప్రకటించింది. సోమవారం ఉదయం నుంచీ వరుసగా సరిహద్దులను మూసివేస్తున్నట్లు సమాచారం అందుతోంది. 14 రోజుల తరువాతే వాటిని పునరుద్ధరించనుంది. భారత్‌లో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతానికి ల్యాండ్ రూట్స్ ని క్లోజ్ చేస్తున్నాం అని అన్నారు.

అయితే, ఉభయ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని మూమెన్ స్పష్టం చేశారు. రవాణా వాహనాలపై ఎలాంటి ఆంక్షలూ ఉండబోవన్నారు. భారత, బంగ్లాదేశ్ మధ్య విమాన ప్రయాణాలను ఈ నెల 14 నుంచే నిలిపివేశారు. కాగా భారత్ ప్రధాని మోదీ గత మార్చి నెలాఖరులోనే బంగ్లాదేశ్ ను రెండు రోజులపాటు విజిట్ చేసి ఆ బంగ్లాదేశ్ నేషనల్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో సమావేశమై 5 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఆ దేశ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ కి నివాళులు అర్పించారు కూడా  ఇప్పుడు ఇండియాలో కోవిద్ కేసులు పెరిగిపోగానే మన దేశానికి బంగ్లాదేశ్ ముఖం చాటేస్తోందన్న విమర్శలు వినవస్తున్నాయి. వైద్యం, ఇతరత్రా అవసరాల కోసం భారత్‌కు వెళ్లిన బంగ్లాదేశీయులు స్వదేశానికి తిరిగి రావడానికి బెనాపోల్, అఖౌరా, బురిమారి సరిహద్దులు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారు.

కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే దేశంలోకి రానిస్తామని స్పష్టం చేశారు. స్వదేశానికి రావడానికి ముందు న్యూఢిల్లీ, కోల్‌కత, అగర్తలాల్లో గల బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అలా వచ్చిన వారిని కూడా రెండు వారాల పాటు క్వారంటైన్ చేస్తామని అన్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, సింగపూర్ వంటి దేశాలు భారత్‌తో విమానయాన సంబంధాలను తెంచుకున్న నేపథ్యంలో తాము సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు
Tags:    

Similar News