మాజీ కేంద్రమంత్రి.. ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న కావూరి సాంబశివరావుకు ఊహించని షాక్ తగిలింది. దాదాపు 18 బ్యాంకుల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకూ అప్పులు తీసుకున్న కావూరి సాంబశివరావుకు చెందిన ఇంజనీరింగ్ సంస్థ ప్రొగ్రెస్సివ్ కన్ స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన వాయిదా మొత్తాల్ని చెల్లించటం లేదు. గత కొద్దికాలంగా ఈ తంతు జరగటంతో పలు బ్యాంకులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కావూరి సంస్థలకు బ్యాంకులు నోటీసులు జారీ చేసినా ఎలాంటి ఫలితం లేదట. 18 బ్యాంకుల నుంచి దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు అప్పులు తీసుకున్న కావూరి కంపెనీ తాను తీసుకున్న అప్పుల్ని తిరిగి చెల్లించాలంటూ హైదరాబాద్ లోని ఆఫీసు కార్యాలయం ఎదుట బ్యాంకు సిబ్బంది నిరసన చేప్టటారు. తీసుకున్న అప్పుల్ని తిరిగి చెల్లించకుండా బ్యాంకులు దివాళా తీసేలా కావూరి వ్యవహరిస్తున్నారంటూ అగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని విధంగా బ్యాంకు సిబ్బంది ఆందోళన చేపట్టటంతో.. కావూరి అండ్ కో లు షాక్ తిన్నట్లుగా తెలుస్తోంది. మరి.. ఇవ్వాల్సిన బకాయిల విషయంలో బాధ్యత కలిగిన కావూరి మీడియా ముందు వివరణ ఇస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఇలాంటి వాటికి కావూరి ఎలా స్పందిస్తారో..?